ఫస్ట్ ఇంప్రెషన్..! అమరావతిపై ఆశలొద్దు..!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి విషయంలో.. కొత్త ప్రభుత్వం వైఖరి ఏమిటో… నేరుగా చెప్పకపోవడంతో… అనిశ్చితి ఏర్పడింది. అమరావతిలో నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. భూముల ధరలు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్లు కూడా పడిపోయాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వం… స్పష్టమైన ప్రకటన చేస్తుందని…. సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని.. మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని… రాజధాని ప్రాంత రైతులు అనుకున్నారు. కానీ.. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం.. ముఖ్యమంత్రి రివర్స్‌లో ఇచ్చారు.

అభివృద్ధికేం తొందరలేదన్నదే ప్రభుత్వ విధానం..!

సీఆర్డీఏపై.. జగన్మోహన్ రెడ్డి మూడు గంటల పాటు జరిపిన సమీక్షలో.. అమరావతి ప్రణాళికలు మొత్తం… అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు ఎక్కడివక్కడ ఆగిపోయిన విషయాన్ని కూడా వివరించారు. ప్రభుత్వం భరోసా ఇస్తే తప్ప.. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడానికి సిద్ధంగా లేరన్న విషయం కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో.. అధికారులకు.. ముఖ్యమంత్రి.. ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. కానీ.. పనుల కాంట్రాక్టులు.. వాటి అంచనాలపై మాత్రం.. ఆరా తీసినట్లు తెలుస్తోంది. అవినీతి జరుగిందని.. గట్టిగా నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి ఆ సంగతి తేల్చిన తర్వాతే అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకుందామన్న సందేశాన్ని పంపారు. సమావేశం తర్వాత మంత్రి బొత్స కూడా అదే చెప్పారు. అవినీతి సంగతి తేల్చిన తర్వాతే .. అభివృద్ధి అన్నారు.

అడిగితే భూములిచ్చేస్తామన్న విధానంతో ఏం జరుగుతుంది..?

అమరావతిలో భూసమీకరణ.. బలవంతంగా జరిగిందనేది ప్రభుత్వ వాదన. రైతులెవరూ.. స్వచ్చందంగా భూములివ్వలేదని.. బలవంతంగా లాక్కున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఆరోపించింది. తాను వస్తే.. అడిగిన వారికి భూములు తిరిగి ఇస్తామని.. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కూడా. అయితే ఆ ప్రకటనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ… సీఆర్డీఏ మొదటి సమీక్షలో మాత్రం .. ఎవరైనా తమ భూములు వెనక్కి ఇచ్చేయాలని అడిగితే ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బొత్స కూడా ప్రకటించారు. ప్రభుత్వంపై చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకం లేకపోతే.. భూములు ఇచ్చిన వారు కచ్చితంగా వెనక్కి తీసుకుంటారు. అలా ఇచ్చేస్తే.. అమరావతిలో నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉండదు.

విచారణ పేరుతో హడావుడి చేస్తే పెట్టుబడులు వస్తాయా..?

అవినీతిని ఎవరూ సమర్థించరు. ఆధారాలుంటే.. కచ్చితంగా.. దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలి. కానీ.. అవినీతి జరిగిందని.. వెలికి తీస్తామని… ప్రభుత్వ వర్గాలే ప్రచారం చేస్తే.. అది.. పెట్టుబడిదారులకు.. ఇబ్బందికరం అవుతుంది. ప్రభుత్వం ఆహ్వానించడం వల్ల తాము పెట్టుబడులు పెట్టి… తాము కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనే ఆందోళన.. లేకపోతే.. తమ పెట్టుబడులు ఇరుక్కుపోతాయనే భయంతో.. వచ్చే వారు ఆగిపోతారు. పెట్టిన వారు.. వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. దీన్ని తగ్గించాల్సిన సర్కార్.. మరింత భయాందోళనలు పెంచుతోందనే అభిప్రాయం మాత్రం ఏర్పడింది. మొత్తానికి కొత్త సర్కార్ అమరావతిపై మొదటి ఇంప్రెషన్‌ మాత్రం.. ఆశలొద్దనే రీతిలోనే ప్రజల్లోకి పంపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close