విభజన సమస్యలకు ఈ రోజే ఆఖరు..!?

విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులేకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రులు.. మిగతా వాటిపై దృష్టి పెట్టారు. నదీ జలాల వివాదం, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన, ఉన్నత విద్యామండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వంటి అంశాలను నెలలో పరిష్కరించుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ భేటీ జరుగుతోంది.

నెలలో ఆరో సారి జగన్ – కేసీఆర్ భేటీ..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య.. నెలలో ఐదో సారి సమావేశం జరుగుతోంది. మొదట గెలిచిన తర్వాత ప్రగతి భవన్‌కు.. జగన్ వెళ్లారు. ఆ తర్వాత ప్రమాణస్వీకారానికి వచ్చినప్పుడు.. జగన్ కేసీఆర్‌ను తన ఇంటికి తోడ్కొని పోయి విందు ఇచ్చి చర్చలు జరిపారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందులో కలసిమెలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి కేసీఆర్ విజయవాడ వచ్చారు. మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద కలిశారు. ఇప్పుడు.. నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్తున్నారు. నెలలో .. ఆరోసారి జరుగుతున్న సమావేశం ఇది. ఇంత తరచుగా.. ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా.. సమావేశమై ఉండరు. వివాదాలను కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ముఖాముఖిగా కూర్చొని చర్చించుకోవాలంటే.. ఇంత కంటే మంచి మార్గం ఉండదని.. నమ్ముతున్నారు.

ఉమ్మడి సంస్థలు, ఏపీ భవన్ పై ఏ నిర్ణయాలు..?

హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను అప్పగించడంలో ఉదారంగా వ్యవహారించిన ఏపీ ప్రభుత్వం.. ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా జనాభా ప్రాతిపదికన పంపిణీయా లేదా విభజన చట్టంలో ఉన్న నిబంధనలకు మేరకు వెళ్దామా అనే అంశంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై ఏసీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు పూర్తి వివరాలు అందజేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనను కూడా ఎజెండాలో చేర్చారు. ఏపీ భవన్ ను జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఏపీ అధికారులు గతంలో వాదించారు. అయితే ఏపీ భవన్ తెలంగాణ వారసత్వ ప్రతీక కావడంతో దాన్ని తమకే పూర్తిగా కేటాయించాలని, ఏపీ భవన్ ను నిర్మించేందుకు మరో ప్రతిపాదన కూడా చేయాలని తెలంగాణ అధికారులు గతంలో ప్రతిపాదించారు.

ప్రాజెక్టులపై పిటిషన్లన్నీ ఉపసంహరించుకుంటారా..?

నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యంగా కృష్ణానది జలాల పంపిణీలో అనేక వివాదాలు నడుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడమే కాకుండా సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి. ఇటువంటి వివాదాలన్నింటినీ కూడా ముఖాముఖి చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరే విధంగా ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close