రాయుడు రిటైర్స్ : గెలవాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు..!

అంతర్జాతీయ క్రికెట్‌లో… తెలుగుగడ్డ పతాకాన్ని రెపరెపలాడించాల్సిన తెలుగు కెరటం… ముందుగానే తెల్లజెండా ఎగరేసింది. కుదురుగా బ్యాట్ పట్టుకుంటే… ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లను గుర్తుకు తెచ్చే అద్భుతమైన శైలి… ప్రతిభ ఉన్న అంబటి రాయుడు.. తన ప్రతిభకు తగ్గ స్థాయికి చేరుకోకుండానే… అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌లో 55 వన్డేలు, ఆరు టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. 55 వన్డేల్లో 1694 పరుగులు చేశాడు. 216 టీ-20ల్లో 4,584 పరుగులు చేశాడు. టీ-20ల్లో సెంచరీ, 24 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బౌలర్‌, వికెట్‌ కీపర్‌గా జట్టుకు సేవలందించాడు. ప్రపంచకప్ తుది జట్టులో చోటు లభిస్తుందనుకున్నాడు. కానీ అవకాశం రాలేదు. తర్వాత స్టాండ్ బై ఆటగాడిగా ఉంచారు. జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ధావన్‌, శంకర్‌ గాయపడిన దూరమైనా.. రాయుడుకు.. బీసీసీఐ పిలుపునివ్వలేదు. దాంతో రాయుడు తీవ్ర అసంతృప్తికి గురై.. గుడ్ బై ప్రకటించాడు.

స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నా చాన్సివ్వని సెలక్టర్లు..!

అబంటి రాయుడు.. కెరీర్ ను పరిశీలిస్తే.. ఇప్పుడు.. టీంలో ఉన్న ఎంతో మంది కన్నా… ప్రతిభ ఉన్న ఆటగాడని ఎవరైనా చెబుతారు. కానీ.. వారి స్థాయికి రాయుడు ఎదగలేకపోవడానికి.. కెరీర్ లో ఎదగలేకపోవడానికి… కీలక సమయాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. దుందుడుకు మనస్థత్వరమే కారణమని చెప్పుకోవచ్చు. చివరికి రిటైర్మెంట్ ప్రకటన కూడా.. ఆ కోణంలోనే జరిగింది. తనను స్టాండ్ బై ఆటగాడిగా ప్రకటించినా… పరిగణనలోకి తీసుకోకుండా… విజయ్ శంకర్ గాయపడిన తర్వాత మయాంక్ అగర్వాల్ ను బీసీసీఐ లండన్ కు పంపడంతో… ఆవేశానికి లోనై రిటైర్మన్ ప్రకటించారు. ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడు కూడా.. ఏకంగా.. బీసీసీఐ సెలక్షన్ కమిటీపైనే విమర్శలు చేశారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై విమర్శలు చేశాడు. టీమిండియా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో పూర్తిగా తెలిసి కూడా అంబటి.. సెలక్షన్ కమిటీని నిందించడంతో.. అప్పుడే.. బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. అయితే ఆ అగ్రహం.. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నా.. అవకాశం ఉన్నా.. జట్టులోకి తీసుకోకపోవడంతో బయటపడిందని చెప్పుకోవచ్చు. అంటే.. ఓ రకంగా.. వరల్డ్ కప్ టీంలో చోటును.. తన ప్రవర్తన ద్వారానే రాయుడు పోగొట్టుకున్నారు.

కెరీర్ అంతా తప్పటడుగులే..!

ఇది మాత్రమే కాదు.. కెరీర్ ప్రారంభం నుంచి రాయుడుది.. వివాదాస్పదమైన వ్యవహారశైలినే. హైదరాబాద్ జట్టుకు ఆడేటప్పుడు.. తనను ఎదగనీయడం లేదని.. ఎప్పుడూ…భావిస్తూ ఉండేవారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దల బంధువులు, వారి ప్రాబల్యం ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నారని భావించేవాడు. అది నిజమే అయినప్పటికీ.. లౌక్యంగా ఎదుర్కోవాల్సిన రాయుడు.. తప్పటడుగులు వేశాడు. అప్పట్లో.. బీసీసీఐకి వ్యతిరేకంగా జీ సుభాష్ చంద్ర ప్రారంభించిన ఎస్సెల్ లీగ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో.. బీసీసీఐ బ్యాన్ వేసింది. చివరికి ఆ లీగ్ అట్టర్ ఫ్లాపైన తర్వాత.. ఎలాగోలా.. బీసీసీఐ కరుణించి.. బ్యాన్ ఎత్తేసింది. ఆ తర్వాత కూడా.. మళ్లీ హైదరాబాద్.. బరోడా రంజీ జట్ల మధ్య చక్కర్లు కొట్టారు. బీసీసీఐ రెబల్ సీరిస్‌కు ఎప్పుడైతే రాయుడు వెళ్లాడో.. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయాడు. కానీ బీసీసీఐ కరుణించడంతో సాధ్యమమయింది. కానీ తన దుందుడుకు ప్రవర్తనతో… పోగొట్టుకున్నారు.

ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదని నిరూపించిన రాయుడు..!

రాయుడు అసాధారణ ప్రతిభవంతుడు. ఆ ప్రతిభను.. అతని వ్యక్తిగత శైలి.. తొక్కేసిందని చెప్పుకోవాలి. రాయుడు ప్రతిభను గుర్తించి.. సచిన్ టెండూల్కర్ ఎంతగానో ప్రొత్సహించాడు. తాను మెంటార్ గా ఉన్న ముంబై జట్టుకు.. ప్రత్యేకంగా సిఫార్సు చేసి మరీ ఎంపిక చేయించాడు. అనేక అవకాశాలు ఇప్పించాడు. సచిన్ మద్దతు పొందడం వల్లే.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అవకాశాలు వచ్చాయి. కానీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరికి ఎంతో ప్రతిభ ఉండి… ఆ స్థాయికి ఎదగలేని.. ఆటగాడిగా రిటైరయిపోయారు. ప్రతిభ ఉంటే.. చాలదని.. దాన్ని ఉపయోగించుకునే.. సామర్థ్యం.. అటు మానసికంగా కూడా ఉండాలనేదానికి ఉదాహరణగా అంబటిరాయుడు నిలుస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close