ఏపీ రాజకీయాల్ని మార్చనున్న పవన్ – రామ్‌మాధవ్ భేటీ..!

తానా సభల్లో పాల్గొనేందుకు.. అమెరికా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ప్రవాసాంధ్రుల మద్దతు కూడగట్టుకోవడమే కాదు.. కొన్ని కీలక రాజకీయ చర్చలు జరుపుతున్నారు. అదే సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో.. పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వీరి మధ్య దాదాపుగా రెండు, మూడు గంటల పాటు చర్చలు జరిగాయని… తెలుస్తోంది. వీరి మధ్య భేటీ… ముందుగానే ఖరారయిందని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఎజెండా ప్రకారమే.. సమావేశం జరిగిందని..సమావేశం మొత్తం.. రాజకీయ అంశాలపైనే జరిగినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పుడు క్లారిటీగా ఉంది. టీడీపీని టార్గెట్ చేసిన.. బీజేపీ.. ఆ పార్టీ సంగతి చూసేసింది. ఇప్పుడు.. బేస్ లెవల్లో ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు… ప్రత్యామ్నాయంగా.. అధికారంలోకి రావడానికి… వైసీపీకి సహకరించినప్పటికీ.. ఇప్పుడిప్పుడే… విధానం మార్చుకుంటోంది. వైసీపీపై విరుచుకుపడుతోంది. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి శైలిలో మార్పులు రావడంతో.. బీజేపీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో.. ఇక.. పవన్ కల్యాణ్.. మాత్రమే బీజేపీకి మిత్రుడిలా కనిపిస్తున్నారు. అందుకే.. ఇక ముందు.. కలసి పని చేద్దామనే ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.

అయితే.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమైనా… కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఏపీకి.. విభజన హామీల ప్రకారం… ఇవ్వాల్సిన వాటిని ఇచ్చిన తర్వాతే కలసి పని చేద్దామని.. సూచించినట్లు చెబుతున్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రామ్‌మాధవ్.. తో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ వైపు నుంచి.. ఏపీ ప్రయోజనాల విషయంలో.. కాస్త ముందడుగు పడితే.. పవన్ కల్యాణ్.. బీజేపీ అందించే స్నేహహస్తాన్ని తీసుకోవచ్చని అంటున్నారు. మొత్తానికి.. తానా సభల్లో.. ఏపీ రాజకీయాలు మారేలా.. కొన్ని కీలక పరిమాణామాలు మాత్రం చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close