కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ హ‌డావుడి త‌గ్గిందేంటి..?

కేంద్ర‌హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ప‌ర్య‌టించారు..! కొంత‌మంది నాయ‌కులు ఆయ‌న చేతులు మీదుగా కాషాయ‌ధార‌ణ చేయించుకున్నారు! ఈ క్ర‌మంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాత్రం కనిపించ‌క‌పోవ‌డం కొంత చ‌ర్చ‌నీయం అవుతోంది. చేర‌బోయే పార్టీ జాతీయ అధ్యక్షుడు హైద‌రాబాద్ కి వ‌స్తే… రాజ‌గోపాల్ రెడ్డి ఏమైన‌ట్టు, వెళ్లి ప‌ల‌క‌రించి, కండువా క‌ప్పి మ‌ర్యాద చెయ్యాలి క‌దా! గ‌డ‌చిన రెండుమూడు రోజులుగా ఆయ‌న ఎందుకు మౌనంగా ఉన్న‌ట్టు అనే చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేసి, పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం నుంచి షోకాజ్ నోటీసు ఎదుర్కొని, భాజ‌పాలో చేరేందుకు ముహూర్తంగా పెట్టేసుకున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు అమిత్ షా ప‌ర్య‌ట‌న త‌రువాత‌… రాజ‌గోపాల్ చ‌ప్పుడు చేయ‌డం లేదు!

ఏ కార‌ణం లేకుండా ఇలా కామ్ అయిపోరు క‌దా! రాజగోపాల్ రెడ్డిపై చ‌ర్య‌ల‌కు ఏఐసీసీ కూడా సిద్ధ‌మైన‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు గ‌త‌వారంలో చెప్పాయి. పార్టీకి వ్య‌తిరేకంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌న్నింటిపైనా ప్ర‌త్యేకంగా ఓ నివేదిక‌ను రాష్ట్ర నాయ‌క‌త్వం నుంచి హైక‌మాండ్ తెప్పించుకుంది. ఆయ‌న భాజ‌పాలో చేరేలోగానే స‌స్పెన్ష‌న్ వేటు త‌ప్ప‌ద‌నీ, పార్టీ వ‌ర్గాల‌కు ఇదో సందేశం అవుతుంద‌నీ అన్నారు. బ‌హుశా… ఆ వేటు కోస‌మే రాజ‌గోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నార‌ని అనిపిస్తోంది. పార్టీ నుంచి ఆయ‌న్ని స‌స్పెండ్ చేసేస్తే… ఆ కార‌ణంతో భాజ‌పాలో చేరాల‌ని స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్న‌ట్టున్నారు.

అయితే, ఆయ‌నే రాజీనామా చేసి వెళ్లే ఆప్ష‌న్ కూడా ఉంది! కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజీనామా చేసి, భాజ‌పా టిక్కెట్ పై ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అనేది అనుకుంత ఈజీ కాదు. ఆ సంగ‌తి ఆయ‌న‌కి తెలియంది కాదు! పైగా, రాజ‌గోపాల్ రెడ్డి భాజ‌పాలో చేరిక‌పై ఆయ‌న అనుచ‌ర‌గ‌ణంలోనే కొంత‌మందికి న‌చ్చ‌డం లేద‌ని స‌మాచారం. వారిని ఆయ‌న బుజ్జగిస్తున్నార‌ట‌. ఇంకోప‌క్క‌… భాజ‌పా త‌ర‌ఫున తానే సీఎం అని రాజ‌గోపాల్ గొప్ప‌లు చెప్పుకున్నారు. ఆ వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర భాజపా నాయ‌క‌త్వం కూడా కోమ‌టిరెడ్డిపై కాస్త గుర్రుగా ఉంది. ఇవ‌న్నీ మెల్ల‌గా సెట్ చేసుకుని… కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకోకుండా భాజ‌పాలో చేరాల‌ని వేచి చూస్తున్నారు! అందుకే, అమిత్ షా వ‌చ్చినా రాజ‌గోపాల్ స్పందించ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

‘కృష్ణ‌మ్మ’ రివ్యూ: కొన్ని అల‌లు… ఇంకొన్ని సుడిగుండాలు

Krishnamma Movie Review తెలుగు360 రేటింగ్: 2.75/5 కొన్ని క‌థ‌ల్ని మ‌ల‌యాళ, త‌మిళ ద‌ర్శ‌కుడు డీల్ చేసే విధానం భ‌లే బాగుంటుంది. వాస్త‌విక‌త‌కు అద్దం ప‌ట్టేలా స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఆయా క‌థ‌ల్లో జీవం ఉట్టిప‌డుతుంటుంది. సినిమాటిక్...

ద‌ర్శ‌కురాలిగా ఆర్.జే!

ఆర్జే.. (రేడియో జాకీ)ల‌కూ టాలీవుడ్ కు గట్టి అనుబంధ‌మే ఉంది. కొంత‌మంది ఆర్‌.జేలు న‌టుల‌య్యారు. ఇంకొంత‌మంది డ‌బ్బింగ్ ఆర్టిస్టులుగా మారారు. కొంద‌రు హీరోలుగానూ మారారు. ఇప్పుడు ఓ ఆర్‌.జే మెగాఫోన్ ప‌ట్ట‌బోతోంది. త‌నే.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close