సాహో… తెలుగు సినిమానా? హిందీ సినిమానా?

సాహోపై ప్రభాస్ అభిమానులే కాదు, యావ‌త్ తెలుగు చిత్ర‌సీమ కూడా భారీగా ఆశలు పెంచేసుకుంది. బాహుబ‌లి రికార్డుల్ని కాస్త క‌దిపే ద‌మ్ము ఈ సినిమాకే ఉంద‌ని ప్ర‌భాస్ అభిమ‌నులు సైతం న‌మ్ముతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా కోసం చాలా ఖ‌ర్చు పెట్టేసింది యూవీ క్రియేష‌న్స్‌. ఆ ఖర్చు, శ్ర‌మ అంతా టీజ‌ర్‌లో క‌నిపించింది కూడా. ఇప్పుడు సాహో సింగిల్స్ ఒకొక్క‌టిగా విడుద‌ల అవుతున్నాయి. ఈ రోజు సాహో తొలి పాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. `సైకో` అంటూ సాగిన ఈ పాట‌ని లిరిక‌ల్ వీడియో కాకుండా, డైరెక్ట్‌గా వీడియో పాటే విడుద‌ల చేయ‌డం ప్ర‌భాస్ అభిమానుల‌కు పండ‌గ ముందే వ‌చ్చినంత సంతోషం వేసింది.

అయితే.. ఆ పాట కాస్త హిందీ పాట‌కి డ‌బ్బింగ్‌లా క‌(వి)నిపించ‌డం ఇబ్బందిగా మారింది. ముందు హిందీలో తీసి, ఆ త‌ర‌వాత తెలుగులో డ‌బ్బింగ్ చేసిన‌ట్టు లిప్ సింక్‌ని బ‌ట్టి ఈజీగా అర్థం చేసుకోవ‌చ్చు. శ్ర‌ద్దా క‌పూర్ లిప్ మూమెంట్ నాన్ సింక్‌లో ఉందంటే ఓ అర్థం ఉంది. ప్ర‌భాస్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు త‌నిష్క్ ఈ పాట‌కు స్వరాలు అందించారు. ఇది ప‌క్కా వెస్ట్ర‌న్ బీట్‌తో సాగిన పాట‌. తెలుగు ప‌దాలు అస్స‌లు అర్థం కావ‌డం లేదు. ప్ర‌భాస్ కాస్త జాలీగా స్టెప్పులేయ‌డం, త‌ను స్టైలీష్‌గా ఉండ‌డం, పాట‌ని రిచ్ లుక్‌లో తీర్చిదిద్ద‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. ఈ పాట ఒక్క‌టే ఇలా ఉంటుందా? లేదంటే.. అన్ని పాట‌లూ ముందు హిందీలో తీసి, ఆ త‌ర‌వాత తెలుగులోకి డ‌బ్ చేశారా? అనే అనుమానం క‌లుగుతోంది. హిందీ మార్కెట్‌పై సాహో చిత్ర‌బృందం చాలా ఆశ‌లు పెట్టుకుంది. వాళ్ల‌ని అల‌రించ‌డానికో `ఇది హిందీ సినిమానే` అని వాళ్ల‌ని బ‌లంగా న‌మ్మించ‌డానికో… హిందీకి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. హిందీ, తెలుగులో ఏక‌కాలంలో సినిమాని తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు ప్ర‌తీ సీనూ, ప్ర‌తీ షాటూ రెండు భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తుంటారు. సాహో మాత్రం ముందు హిందీలో తీసి, ఆ త‌ర‌వాత తెలుగులోకి డ‌బ్ చేసిన‌ట్టు అనిపిస్తోంది. స‌న్నివేశాలూ ఇలానే చేస్తే మాత్రం తెలుగులో సాహోకి నెగిటీవ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రి `సాహో`లో ఏం జ‌రిగిందో..?? ఈ సినిమాని ఎలా తీశారో? మ‌రో పాట బ‌య‌ట‌కు వ‌స్తే గానీ తెలీదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close