డాక‌ర్లు నా ప్రాణాన్ని కాపాడారు: పోసాని

ఇటీవ‌ల న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి ఆరోగ్యం క్షీణించిన‌ట్టు, ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. ఆయ‌న‌కు ఓ ఆప‌రేష‌న్ ఫెయిల్ అయితే, మ‌రో ఆప‌రేష‌న్ కూడా చేసిన‌ట్టు చెప్పుకున్నారు. వీటిపై పోసాని స్పందిస్తూ ఓ వీడియో బైట్ విడుద‌ల చేశారు. తాను అనారోగ్యం పాలైన విష‌యం నిజ‌మే అని, డాక్ట‌ర్లు త‌న ప్రాణాల్ని కాపాడార‌ని, ఇప్పుడు సంపూర్ణంగా కోలుకున్నాన‌ని ఆ వీడియోలో చెప్పారు. అంతేకాదు.. వారం ప‌ది రోజుల్లో తాను మ‌ళ్లీ షూటింగుల‌లో కూడా పాల్గొన‌డానికి రెడీ అవుతున్నాన‌ని చెప్పుకొచ్చారు.

”కొన్నాళ్లుగా ఆ ఆరోగ్యం బాలేద‌ని, విష‌మంగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లొచ్చాయి. నిజ‌మే.. నాకు అనారోగ్యం వ‌చ్చింది. కానీ చ‌చ్చిపోయేంత‌గా కాదు. య‌శోద‌లో చేరాను. డా.ఎంవీ రావుగారు న‌న్ను బ‌తికించారు. పరిపూర్ణ‌మైన ఆరోగ్య‌వంతుడ్ని చేశారు. నా ఆరోగ్యం గురించి ఎలాంటి ఆలోచ‌న‌లూ వ‌ద్దు. ఇన్నాళ్లు నా ఆరోగ్యం గురించి కంగారు ప‌డ్డ‌వాళ్ల‌కు, నేను బాగుండాల‌ని పూజించిన వాళ్ల‌కు శ‌త‌దా కృత‌జ్ఞ‌త‌లు” అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close