నేడో, రేపో తెలంగాణకు కొత్త గవర్నర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం హుటాహుటిన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో గంట సేపు భేటీ అయ్యారు. కానీ దేనిపై చర్చించారో క్లారిటీ లేదు. అసలు విషయం మాత్రం.. రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం ఖాయమన్న కచ్చితమైన సమాచారం రావడంతోనే… కేసీఆర్… ప్రత్యేకంగా గవర్నర్‌తో సమావేశమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మోడీ రెండోసారి అధికారం చేపట్టాక ప్రత్యేకంగా గవర్నర్ ల నియామకాలపై దృష్టి పెట్టారు. కరుడుగట్టిన సంఘ్ నేతలను ఏరి కోరి నియమిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రత్యేక దృష్టి తో గవర్నర్ లను నియమిస్తున్నారు. తాజాగా ఏపీకి కూడా గవర్నర్‌ను నియమించారు. ఐదేళ్లు గా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగిన నరసింహన్ ను ఏపీ నుండి తప్పించి తెలంగాణ కు పరిమితం చేశారు.

గవర్నర్ మార్పు నేపధ్యంలోనే కేసీఆర్ భేటీ..!

బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణా లో రాజకీయంగా బలపడాలని భావిస్తోంది..అందుకే బీజేపీ నేపథ్యం ఉన్న నేతను తెలంగాణా గవర్నర్ గా నియమించే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. బెంగాల్ తరహాలో పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో పనిచేసే రాజకీయ నేతను తెలంగాణా గవర్నర్ గా నియమించబోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా అమరావతి కి వెళ్లి జగన్ తో భేటి అయిన రెండు రోజులకే ఏపీ కి కొత్త గవర్నర్ ను నియమించారు.. గవర్నర్ మారుతున్నారన్న సమాచారం తోనే కేసీఆర్ రాజ్ భవన్ లో నరసింహన్ తో చాలా సేపు భేటి అయ్యారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి..

అసెంబ్లీ లాబీల్లో గవర్నర్ మార్పుపైనే చర్చ..!

నరసింహన్ ను కూడా తెలంగాణ నుండి కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే లాబీల్లో దీనిపై జోరుగా చర్చ జరిగింది. రెండు మూడు రోజుల్లో నే తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. నరసింహన్ 12 ఏళ్లుగా గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో 4ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, విభజన తర్వాత ఐదేళ్లు రెండు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారు. ఇంత సుదీర్ఘ కాలం ఒకే చోట ఉండటం రికార్డ్. కాంగ్రెస్ హయాంలో నియమితులైనా,ఐదేళ్లు గా బీజేపీ పాలనలోనూ వున్నారు..

ఉమ్మడి సంస్థలపై చివరిగా ఆదేశాలిస్తారా..?

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా … నరసింహన్ విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. అయితే.. ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించకపోడంతో.. టీడీపీ హయాంలో.. ఎక్కడివక్కడ ఉండిపోయాయి. అయితే.. గవర్నర్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మాత్రం వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత.. గవర్నర్.. హుటాహుటిన భవనాలను అప్పగించేశారు. ఉమ్మడి సంస్థల పంపకం.. ఇప్పుడు గవర్నర్ వద్ద ఉంది. ఆయన దీనిపై వెళ్లేటప్పుడు… ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తారా.. అన్న ఉత్కంఠ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close