పాపం.. నారా రోహిత్

ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి… బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి. రెండింటికీ మ‌ధ్య ఒక్క ఫ్లాప్‌… ఒక్క హిట్ చాలు.

ప్ర‌స్తుతం నారా రోహిత్ ప‌రిస్థితి అలానే ఉంది. ఈరోజు రోహిత్‌ పుట్టిన రోజు. గ‌తేడాది ఇదే రోజున‌… నారా రోహిత్ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పేప‌ర్లలో యాడ్లొచ్చాయి. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో మోత మోగించేశారు. రెండు మూడు కొత్త సినిమాలు ప్ర‌క‌టించారు. అవి ఏవీ ప‌ట్టాలెక్క‌లేద‌నుకోండి.. అది త‌రువాతి సంగ‌తి. ఈరోజు ఆ సంద‌డి లేదు. కొత్త సినిమాల క‌బురు లేదు. క‌నీసం పేప‌ర్ యాడూ లేదు. ఇది నిజం.

బాణం, ప్ర‌తినిధి సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు నారా రోహిత్‌. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనుకున్నారు. కానీ.. ఆ త‌ర‌వాత ప‌రిస్థితి మారింది. రోహిత్ కూడా అంద‌రిలా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌ వైపు మొగ్గు చూపించాడు. ఫైట్లూ, పాట‌లూ అంటూ ఫార్ములాల వెంట ప‌డ్డాడు. కానీ అవేం నారా రోహిత్‌కి సూట‌వ్వ‌లేదు. మ‌ళ్లీ కొత్త‌ద‌నం కోసం పాకులాడినా, అలాంటి క‌థ‌లు అత‌నికి దొర‌క‌లేదు. మ‌రోవైపు.. ఇదే ఫార్మెట్లో సినిమాలు తీసిన కొత్త హీరోలు స‌క్సెస్ అయ్యారు. హిట్లు కొట్టారు. అవ‌కాశాలు సంపాదించుకున్నారు. నారా రోహిత్ మాత్రం హిట్లు లేక రోహిత్ కాస్త `నో`హిట్ అయ్యాడు. దాంతో అవ‌కాశాలు రావ‌డం మానేశాయి. సెట్స్‌పైకి వెళ్లిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయ‌లేడు, అలాగ‌ని మ‌ధ్య‌లో వ‌దిలేయ‌లేడు. దానికి త‌గ్గ‌ట్టు బాడీ షేప‌ప్‌పై దృష్టి పెట్ట‌లేక‌పోయాడు. బాగా లావైపోవ‌డం వ‌ల్ల ఈజ్ పోయింది. అందుకే.. రోహిత్‌ని ప‌రిశ్ర‌మ‌, అందులోని వ్య‌క్తులు మ‌ర్చిపోయారు. పైగా టీడీపీ పార్టీ రాజ‌కీయంగానూ బ్యాక్‌స్టెప్‌లో ఉంది. పెద‌నాన్న చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌న చుట్టూ చేరిన `భ‌జ‌న‌` బృందం ఇప్పుడు లేదు. వాస్త‌వాలు ఇప్ప‌టికైనా రోహిత్‌కి అర్థ‌మై ఉంటాయి. త‌న‌కు కావ‌ల్సింది ఒక్క హిట్టు. అదెలా సంపాదించాలో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇప్పుడు రోహిత్ కొత్త క‌థ‌ల వేట‌లో ఉన్నాడు. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయాల‌ని ఎదరుచూస్తున్నాడు. అందుకు స‌న్నాహాలు కూడా భీక‌రంగానే జ‌రుగుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close