జగన్ సర్కారూ ఇసుకలో కాలేసింది..! కడుక్కునేదెలా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక హాట్ టాపిక్ అయింది. యాభై కేజీల సిమెంట్ బస్తా రూ. 280 ఉంటే… అదే ఇసుక మాత్రం… అదే సిమెంట్ బస్తాలో పోసి.. రూ. 300కు అమ్ముతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అది అతిశయోక్తిలాగే ఉన్నా… అసలు నిజం మాత్రం.. లారీ ఇసుక రూ. 25 నుంచి 30వేల వరకూ పలుకుతోంది. టీడీపీ నేతలు ఇసుకతో కోట్లు సంపాదిస్తున్నారని.. తీవ్రమైన ఆరోపణలు వచ్చిన కాలంలో… ఇసుక లారీ రూ. పదివేల లోపే ఉంది. దాంతో.. రెండు నెలల్లోనే మారిపోయిన పరిస్థితి.. ఏపీ నిర్మాణ రంగాన్ని కుదేలు చేసింది. కార్మికులు పనులు లేక రోడ్డునపడ్డారు. భవన నిర్మాణంతో సంబంధం ఉన్న ప్రతీ రంగం.. ఏపీలో సంక్షోభం అంచున నిలిచింది.

నాడు చంద్రబాబును ముంచేసిన ఇసుక తుపాన్..!

రాష్ట్ర విభజన తరవాత ఏపీలో 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇసుక విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఇసుక అత్యంత సన్నితమైన వ్యవహారం కాబట్టి.. మహిళల చేతుల్లో పెడితే.. అక్రమాలు తగ్గుతాయని అనుకున్నారు. డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం… దాన్నో గొప్ప అవకాశంగా మార్చుకున్నారు. డ్వాక్రా సంఘాలను డమ్మీలు చేసి.. తామే మాఫియా అవతారం ఎత్తారు. అధికారికంగా.. అమ్మేది తక్కువ. బ్లాక్‌మార్కెట్‌కి పోయే ఇసుకే ఎక్కువ. డ్వాక్రా సంఘాలు క్యూబిక్‌ మీటర్‌ రూ.650లకు విక్రయిస్తుంటే బ్లాక్‌ మార్కెట్‌దారులు రూ.300లకే సరఫరా చేశారు. ఇలాంటి తవ్వకాలు జరుపుతూ.. అధికారులు దాడులు చేస్తే… వారిపైనా… టీడీపీ నేతలు జులుం ప్రదర్శించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి అనతి కాలంలో చెడ్డ పేరు తీసుకు రావడంతో.. సీఎం త్వరగా మేలుకున్నారు. ప్రభుత్వానికి.. ఇసుకపై వచ్చే.. రూ. ఐదారు వందల కోట్ల ఆదాయంతో పోలిస్తే… చెడ్డపేరు అంతకు మించి వస్తోందని గ్రహించి.. డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి.. ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఉచితంగా ఇచ్చినా… వ్యతిరేకత పెంచేసిన ఇసుక..!

ఇసుక విషయంలో మాఫియా చెలరేగిపోతూండటంతో.. చంద్రబాబు.. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. రవాణా ఖర్చులు భరించి… ఎవరైనా ఇసుకను తీసుకెళ్లేలా.. విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ప్రకారం.. నిర్మాణ అనుమతి పత్రం చూపించి… గుర్తించిన రేవుల నుంచి కేవలం ఇసుక లోడింగ్‌ ఛార్జీలు చెల్లించి ఉచితంగా రవాణా చేసుకోవచ్చు. అయితే ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు రెచ్చిపోయారు. ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుక నుంచి భారీగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. అక్రమ రవాణాతో కోట్లకు .. పడగలెత్తిన నేతలున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక అవినీతిపై విస్తృత ప్రచారం చేసింది. ఎంత టీడీపీ నేతలు మాఫియాగా మారినట్లు ఆరోపణలు ఉన్నా.. అప్పట్లో లారీ ఇసుక.. రూ. పదివేల కన్నా తక్కువే ఉండేది.

అదే ఇసుకలో కాలేసిన జగన్..!

చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత పెరగడానికి ఇసుక కూడా ఓ కారణమని.. జగన్‌ బాగా అంచనా వేశారు. అందుకే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సీఎం కాగానే… ఇసుక విషయంలో జరుగుతున్న తప్పులన్నింటినీ.. తగ్గిస్తారని భావించారు. కానీ అయన.. అసలు ఓ విధానమంటూ లేకుండానే కాలం గడిపేయడం… అసాధారణంగా కనిపిస్తోంది. మొదట్టమొదటి సమీక్షలోనే.. అసలు ఇసుక ఎక్కడిదక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త విధానం వస్తుంది కాబట్టి… అప్పటి వరకూ.. ఎవరూ ఇసుకను రవాణా చేయవద్దని ఆదేశించారు. ఇది జూన్ మొదటి వారంలో జరిగింది. అప్పట్నుంచి ఇసుక బంగారంగా మారిపోయింది. జూలై ఒకటిన సర్కార్ కొత్త విధానం ప్రకటించకపోగా… మరో రెండు నెలల తర్వాత చూద్దామన్నట్లుగా మాట్లాడారు. తాత్కలికంగా.. ఇసుకను అధికారుల అనుమతితో పొందవచ్చని ప్రకటించారు. దానికి.. ఎమ్మార్వో.. ఆర్డీవో నుంచి కలెక్టర్ వరకూ ప్రాసెస్ పెట్టారు. సామాన్యుడు.. ఇసుక కోసం.. పర్మిషన్ తీసుకోవాలంటే.. జరిగే పని కాదు. దాంతో.. ఇసుక ఏపీలో ఇప్పుడు… అందని వస్తవైపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. చిన్న చిన్న వ్యాపారులు కుదేలయ్యారు.

వైసీపీ నేతలకు మూడు నెలల జగన్ చాన్సిచ్చారా..?

ఇసుక విషయంలో ఏపీ సర్కార్ కఠిన వైఖరి.. పైకి మాత్రమే కనిపిస్తోంది. అక్రమ రవాణా విషయంలో మాత్రం చూసీ చూడనట్లు ఉంటున్నారు. కానీ ఇది అనధికారిక ఇసుక కాబట్టి.. లారీ ఇసుక రూ. పాతిక నుంచి 30వేలకు అమ్ముకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ అధికారంలోకి వస్తే.. నేతలందరికీ.. సంపాదించుకునే అవకాశం ఇస్తామని… ఓ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. తను ఇచ్చిన మాట ప్రకారం.. ఇసుక నుంచి.. వైసీపీ నేతలు మూడు నెలలు సంపాదించుకునే అవకాశం ఇచ్చారన్న ప్రచారం సామాన్యుల్లో జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాలో.. వైసీపీ ప్రజాప్రతినిధులు.. నేరుగా.. పాల్గొంటున్నారు. కొన్ని కొన్ని చోట్ల .. వాటాల్లో తేడాలొచ్చి.. వేరే కారణాల పేరుతో కేసులు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగా పదమూడు జిల్లాలోనూ.. ఇదే పరిస్థితి. దాదాపు ప్రతీ చోటా.. … ఒకటే మాట… ఆరోపణలున్నా.. గతంలోనే బాగుండేదని..!

జగన్మోహన్ రెడ్డి కొత్త విధానం తెస్తామని ప్రకటించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే వస్తుందని… మరొకటని చెబుతున్నారు. ఆ విధానమేంటో త్వరగా ప్రకటించి.. ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి.. అక్రమాలు లేకుండా చేస్తేనే.. ఉపయోగం ఉంటుంది. కానీ మూడు నెలల్లోనే.. తమ పార్టీ నేతలకు ఇసుక అలవాటు చేసి.. ఆ తర్వాత వాటిజోలికి పోవద్దంటే.. ఎవరు మాత్రం సైలెంట్‌గా ఉంటారు..! ఎవరూ ఉండరు… ఎందుకంటే.. అది ఇసుక.. బంగారం లాంటిది..! తేడా వస్తే. ప్రభుత్వాల్నే కూల్చేయగలరు మరి..! తస్మాత్ జాగ్రత్త…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close