జైపాల్ రెడ్డి ఇక లేరు..!

సీనియర్ రాజకీయ వేత్త జైపాల్ రెడ్డి కన్నుమూశారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ.. రాత్రి ఒకటిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన నిమోనియాతో బాధపడుతున్నారని.. కుటుంబసభ్యులు చెబుతున్నారు. 77 ఏళ్ల జైపాల్ రెడ్డి… దేశ రాజకీయాల్లో ప్రభావిత పాత్ర పోషించారు. రాష్ట్ర రాజకీయాల్లో కన్నా.. ఆయన ఎక్కువగా దేశ రాజకీయాల్లోనే కీలకంగా వ్యవహరించారు.

ఉమ్మడి హబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించిన జైపాల్ రెడ్డి… ఉన్నత విద్యావంతుడు. ఆయనకు విషయ పరిజ్ఞానం ఎక్కువ. మొదటి సారిగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకించి 1977లో జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత పరిణామాల్లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా 1999, 2004లలో విజయం సాధించారు. 1990, 1996లలో రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.

యూపీఏ హయాంలో.. ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. అలాగే.. గతంలో.. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కూడా పని చేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళేశ్వరంపై మరో కమిటీ… జ్యుడిషియల్ కమిటీ నిర్ణయం..?

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను పాయింట్ టూ పాయింట్ గుర్తించే పనిలో పడింది జ్యుడిషియల్ కమిషన్. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి జరిగిన అంశాలను నిగ్గు తేల్చి ఫైనల్ రిపోర్ట్ ను...

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్… ప్రమాదంపై అనుమానాలు..!

ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది....

ఎన్టీఆర్… ఎందుకంత‌ స్పెషల్ ?!

నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన హీరో... రెండు దశాబ్దాల తర్వాత కూడా అగ్రపధంలో కొనసాగడం అంటే అదొక స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌ ప్రయాణంలానే చూడాలి. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్...
video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close