చైతన్య : తేల్చేస్తున్నారు సార్…! ఢిల్లీ మెడలు వంచేదెప్పుడు..!?

కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉంది. ఏదైనా ” ప్లీజ్ … ప్లీజ్ ” అని బతిమాలుకుని చేయించుకోవాల్సిందే. అలా అయినా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి .. మొదట్లో చెప్పారు. కానీ రెండు నెలల్లోనే ఆయన.. ప్లీజ్ .. ప్లీజ్ ఫ్లాన్.. ఘోరమైన ఫలితాలను ఇస్తోంది. కేంద్రం.. ఒక్కొక్క అంశాన్ని తేల్చేస్తూ పోతోంది. ఏపీకి ఏమీ ఇవ్వబోమని అంటోంది. కేంద్ర సాయం లేకపోతే.. ఏపీ అభివృద్ధి పరంగా ముందడుగు వేసే అవకాశం లేకపోవడంతో… ఆ సాయం పొందడానికి ఇప్పుడు… రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యూహం అమలు చేయబోతోందనేది కీలకంగామారింది.

ఐదేళ్లు పోరాడిన వాటిపై యాభై రోజుల్లో తేల్చేసిన కేంద్రం..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా మెలిగేందుకు పెట్టుకున్న “ప్లీజ్ .. ప్లీజ్ ” ప్లాన్ ఏ మాత్రం సత్ఫలితాలు ఇవ్వడం లేదని..ఈ యాభై రోజుల్లో… తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేము కానీ… ఏపీ మాత్రం.. మాకు ప్రత్యేక రాష్ట్రమేనని… నిధుల పరంగా ప్రత్యేకంగా చూస్తామని.. కేంద్రం పెద్దలు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా.. పార్లమెంట్‌లో మాత్రం.. ఏపీని ప్రత్యేకంగా చూసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పేశారు. యాభై రోజుల్లో… గత ఐదేళ్లలో పోరాడిన అనేక అంశాలకు.. కేంద్రం చెక్ పెట్టింది. ప్రత్యేకహోదా ఇచ్చే ప్రశ్నే లేదని వారానికోసారి ప్రకటిస్తోంది. అమరావతి రుణ ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. వెనుకబడిన జిల్లాల నిధుల ఊసు లేదు..!. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాధ్యత లేదని ప్రకటించింది. ఇలా.. ఏది చూసుకున్నా కేంద్రం ఏపికి ఏమీ ఇవ్వబోవడం లేదని తేల్చింది. ఇలా యాభై రోజుల్లోనే… ఏపీకి రావాల్సిన … వస్తాయని… ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా పోరాటం చేసిన వాటిపై .. కేంద్రం.. చాలా సింపుల్ గా… తేల్చేసింది.

విభజన హమీలపైనా “ప్లీజ్.. ప్లీజ్” వర్కవుట్ కావడం లేదు..!

ఏపీ సర్కార్.. కేంద్రంతో మాత్రమే కాదు… పొరుగు రాష్ట్రం తెలంగాణతోనూ… రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో… చాలా మెతక ధోరణితో వ్యవహరిస్తోంది. జగన్ సీఎంగా పదవి చేపట్టిన మరుక్షణం.. తెలంగాణకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ.. ఏపీకి అనుకూలంగా ఒక్కటంటే.. ఒక్క నిర్ణయాన్ని… తెలంగాణ నుంతి తెప్పించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత… హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించేశారు. ఏపీ ఖర్చుతో.. తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టులు కట్టేంత పెద్ద మనసు చేసుకున్నారు. గతంలో తాను వ్యతిరేకించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లి వచ్చారు. ఓ రకంగా..తెలంగాణ.. ఏపీ నుంచి.. తమ ప్రయోజనాలన్నింటినీ కాపాడుకుంది. కానీ.. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో మాత్రం .. సీఎం జగన్.. కేసీఆర్ చూపించినంత చొరవ చూపడం లేదు. ఐదు వేల కోట్లుకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజన, వివాదంలో ఉన్న ఉద్యోగుల విభజన, పోలవరంపై తెలంగాణ వేసిన కేసులు.. ఇలా.. ఏ అంశంలోనూ… ఏపీకి అనుకూలంగా ఒక్క ప్రకటన కానీ.. నిర్ణయం కానీ జగన్ తీసుకురాలేకపోయారు. కానీ.. కేసీఆర్ ను మాత్రం.. అసెంబ్లీ సాక్షిగా..పొగిడేస్తున్నారు.

ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు ఏం చేయబోతున్నారు..?

జగన్మోహన్ రెడ్డి సర్కార్.. అటు కేంద్రాన్ని.. ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడటానికి పోటీ పడుతోంది. మరి.. ఏపీ ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయి..?. ప్రభుత్వం చేపట్టి…రెండు నెలలు కూడా కాలేదు కాబట్టి.. మరికొన్ని రోజులు ఎదురు చూస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే., కీలకమైన అంశాలపై.. విధానపరమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించేస్తూ ఉంటే.. తర్వాత నోరు తెరిచి ఏం లాభమనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఏపీ ప్రయోజనాలను కాపాడే విషయంలో.. సీఎం జగన్ రాజీ పడితే… ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్లో రాజీపడినట్లే అవుతుంది. మరి జగన్ ఏం చేయబోతున్నారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close