సీపీఎస్‌పై చంద్రబాబు వేసిన కమిటీకే జగన్ ఓటు…!

“అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం… కమిటీల పేరుతో కాలయాపన చేయను.. ” అని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు… కమిటీలతోనే కాలక్షేపం చేస్తున్నారు. మొదటి కేబినెట్ సమావేశంలో… సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు జగన్ నిర్ణయించారని.. ప్రకటించారు. దాని కోసం.. బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంకా పని ప్రారంభించిందో లేదో క్లారిటీలేదు. రెండు నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు కొత్తగా మరో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వం వహిస్తారు. ఆదిమూలపు సురేష్‌, పెద్దిరెడ్డి, ఆళ్ల నాని సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ సీపీఎస్ విధానంపై.. చంద్రబాబు సర్కార్ వేసిన టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తుంది. సీపీఎస్‌ విధానంపై ఈ ఏడాది ఫిబ్రవరి 28న చంద్రబాబు ప్రభుత్వానికి టక్కర్‌ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో.. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉరదని తేల్చింది. టక్కర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పించింది. సీపీఎస్ ను రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూనే రెండు ఆప్షన్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. సీపీఎస్ రద్దు చేయడం లేదా..సీపీఎస్ ను కొనసాగించి … పాత పెన్షన్ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కల్పించడం… ఆప్షన్లుగా ఇచ్చింది.

బుగ్గన నేతృత్వంలోని కమిటీ… ఠక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే… ఇది కాలయాపనకేనని ఉద్యోగ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న ప్రకటనను గుర్తు చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close