కశ్మీరీల అభివృద్ధి కోసం దేశం..! మోడీ భరోసా..!

జమ్మూకశ్మీర్ ప్రజల అభివృద్ధికి, హక్కులకు ఇంత కాలం ఆర్టికల్ 370 అడ్డంకిగా ఉందని.. ఇప్పుడు… ఆ సమస్యలు తొలగి పోవడమే కాకుండా.. భవిష్యత్ బంగారు మయం అవుతుందని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. కశ్మీరీలకు భరోసా ఇచ్చారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్‌ని విభజించిన తర్వాత తొలి సారి మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని .. ఆర్టికల్ 370తో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో ఉన్న ప్రజలకు జరిగిన అన్యాయంపై ఇంత వరకూ ఎవరూ మాట్లాడలేదన్నారు. ఆర్టికల్ 370తో జమ్మూకశ్మీర్‌కు ఏం ఒరిగిందని.. మోడీ ప్రశ్నించారు. 370, 35ఏ వల్ల కశ్మీర్‌లో కుటుంబ వాదం, తీవ్రవాదం, అరాచకవాదం పెరిగాయన్నారు. ఈ రెండు అధికరణలు దేశం మీద విషం కక్కడానికి ఉపయోగపడ్డాయన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో వర్తమానంలో సమస్యలు తొలగిపోవడమే కాదు భవిష్యత్‌ కూడా బంగారుమయం అవుతుందని భరోసా ఇచ్చారు.

ఇక కశ్మీరీలకు సమాన హక్కులు..అవకశాలు..!

పార్లమెంట్‌ చట్టం చేస్తే దేశంలో ఓ ప్రాంతానికి ఆ చట్టం వర్తించదు అనే విషయం కనీసం ఊహకు కూడా అందదని … కానీ అది ఇన్నాళ్లు వాస్తవమని ఆర్టికల్ 370 గురించి మోదీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఇప్పుడు ప్రతి చట్టం కశ్మీర్‌కు వర్తిస్తుందన్నారు. కేంద్ర పథకాలు, విధానాల ఫలితాలు లక్షలాది మంది కశ్మీరీలకు ఇంతకాలం అందలేదని.. ఇప్పుడు అలాంటి అన్యాయాలన్నీ నిర్మూలించామన్నారు. మిగతా రాష్ట్రాల్లో చిన్నారులకు ఎలాంటి భరోసా ఇస్తున్నామో ఇప్పుడు కశ్మీర్‌లో కూడా అలాంటి సదుపాయాలే ఉంటాయని హామీ ఇచ్చారు. భవిష్యత్‌ తరాలు అపూర్వంగా మారుతాయన్నారు. కనీస వేతన చట్టం లాంటివి కశ్మీర్‌లో అమలైతే జీవితాలు మారుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఫలాలు కూడా ఇప్పుడు కశ్మీర్‌ అందరికీ అందుతాయని.. సమాన హక్కులు, అవకాశాలు కశ్మీరీలకు అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు.

కశ్మీరీ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు..!

కశ్మీర్‌లో ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసులకు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు అందాలో తక్షణం వాటన్నింటినీ కల్పిస్తామని … కశ్మీర్‌లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆర్థికసాయం చేసేందుకు చర్యలు తక్షణం తీసుకుంటున్నామని మోడీ ప్రకటించారు. సైన్యంతో పాటు ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లు ఇప్పుడు సాకారం అవుతాయని.. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌, పవర్‌ ప్రాజెక్ట్‌లు అన్నీ ఇప్పుడు కశ్మీరీలకు అందుబాటులోకి వస్తాయని మోదీ ప్రకటించారు. రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్‌పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలు అద్భుతంగా సిద్ధమవుతాయని భవిష్యత్ గురించి వివరించారు. ఎల్లకాలం..కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండబోదన్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ ఎంతో కాలం ఉండాల్సిన అవసరం రాదనుకుంటున్నానని ప్రకటించారు. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

కలసి నడిచి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామన్న ప్రధాని..!

ఒకప్పుడు సినిమా షూటింగ్‌లన్నీ కశ్మీర్‌లోనే జరిగేవని.. మళ్లీ అలాంటి రోజులు వస్తాయని.. మోదీ ఆకాంక్షించారు. ఒక్క బాలీవుడ్‌ కాదు ప్రపంచ దేశాల నుంచి వచ్చి కశ్మీర్‌లో షూటింగ్‌లు చేస్తారని… ఆశాభావం వ్యక్తం చేశారు. హిందీ, తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు సినిమా షూటింగ్‌లను కశ్మీర్‌లో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌లో ఉన్న వనమూలికలు దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకజమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కష్టసుఖాలు ఇక దేశం అందరివని ప్రకటించారు. కశ్మీరీలందరికీ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపి.. నవ జమ్మూకశ్మీర్‌, నవ లద్దాఖ్‌లు నిర్మిద్దాం … కలిసి సాగుదాం, బంగారు భవిష్యత్‌ నిర్మించుకుందాం మోదీ పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close