ఆ వైసీపీ ఎమ్మెల్యే అందర్నీ అడ్డంగా నరికేస్తారంతే..!

అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాను… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీయిజానికి వాడుకుంటున్నారు. అసెంబ్లీలోనే చంద్రబాబును వేలి పెట్టి చూపి, కన్నెర్ర చూసి.. ” ఖబర్దార్.. ఖబర్దార్ ” అంటూ.. ఊగిపోయినప్పుడే… కోటంరెడ్డి.. కంట్రోల్ తప్పిపోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ.. ఆయన చేసింది తప్పని చెప్పలేదు. అందుకే.. తానే రైట్ అనుకుంటున్నారు. నెల్లూరులో .. ఓ మాదిరి డాన్‌గా మారిపోతున్నారు. ఆదివారం రాత్రి…నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లో ఉన్న ” జమీన్ రైతు” అనే పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. దానికి కారణం.. ఆ పత్రికలో.. కోటంరెడ్డి.. అరాచక వాది అనే కథనం రాశారట. “ఇప్పుడు నిన్ను చంపేస్తా.. మూడు పేజీల కథనం రాసుకో” అంటూ.. పోకిరి సినిమాలో విలన్లను గుర్తుకు తెచ్చేలా హల్ చల్ చేశారు.

డోలేంద్రప్రసాద్ ఇంటికి వచ్చి వెళ్తున్న ఓ మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కొచ్చి పడేశారు. అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం… నెల్లూరులో గగ్గోలు రేపింది. అంతకు ముందు.. ఓ విలేకరి…తనపై కథనం రాశాడంటూ.. ఆయన.. ఫోన్ చేసి.. నడిరోడ్డుపై నరికేస్తానని… హెచ్చరించిన ఆడియో టేపు కలకలం రేపింది. అవన్నీ ఇమేజ్ పెంచుతున్నాయని అనుకున్నారేమో కానీ.. నేరుగా చంద్రబాబునే అసెంబ్లీలో హెచ్చరించారు. దాంతో.. ఇక అడ్డు చెప్పే వారు ఎవరూ లేరని.. ఆయన చెలరేగిపోతున్నారు. జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడంతో.. పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేశారు. నిజానికి ఈ కోటంరెడ్డి బెట్టింగ్ రాకెట్ నిర్వహణలో మాస్టర్ మైండ్ అని పోలీసుల దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి.

గత ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే.. రాజకీయ వేషాలేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. గర్భంతో ఉన్న తన కుమార్తె పేరుతో సెంటిమెంట్ వేషాలేశారు. అప్పట్లోఅలా ఉన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు… అందర్నీ.. నరికేస్తానంటూ… చెలరేగిపోతున్నారు. వైసీపీ సర్కార్ వస్తే రౌడీ రాజ్యమేనని వస్తున్న విమర్శల్లో నిజం ఉందని నిరూపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close