అలా జరిగితే జగన్‌ ఇరుక్కుపోతాడంతే!

రాజకీయాల్లో పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ.. కాపు ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించడానికి తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ.. చంద్రబాబునాయుడు సర్కారును ఇబ్బందుల పాల్జేయడానికి తన వంతు కృషిచేస్తున్నప్పటికీ… మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి తాను వ్యక్తిగతంగా విపరీతమైన టెన్షన్‌ల మధ్య గడుపుతున్నారా? తన మీద ఉన్న ఆర్థిక నేరాల కేసులు ఆయనకు ఊపిరి సలపనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయా? ప్రస్తుత వాతావరణం చూస్తే అలాగే కనిపిస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకుని ఉన్న కుల రాజకీయ వాతావరణం వేడి దృష్ట్యా అంతగా మన దృష్టి పడడం లేదు గానీ.. వైఎస్‌ జగన్మోహనరెడ్డి మీద విచారణలో ఉన్న ఆర్థిక అక్రమాల కేసులు మరోవైపు చురుగ్గా కదులుతున్నాయి. ఇటీవల ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) వారి విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ విచారణ జగన్‌కు చాలా ఇబ్బందికరంగా మారినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం సీబీఐ దాఖలు చేసిన కేసులన్నీ సీబీఐ కోర్టులోనే విచారణ జరుగుతున్నాయి. వీటి ఆధారంగా ఈడీ కూడా ఓ కేసు పెట్టింది. ఒకసారి ఈడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత.. జగన్‌ వర్గానికి ఓ ఆలోచన వచ్చింది. ఇక్కడ విచారణలో ఉన్న సీబీఐ కేసులు కొలిక్కివచ్చే దాకా ఈడీ విచారణ ఆపేసేలా స్టే ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో ప్రత్యేకంగా ఓ కేసు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఈడీ విచారణ సమాంతరంగా సాగితే జగన్‌ చాలా ఇబ్బంది పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే వీరి విజ్ఞప్తిని ఈడీ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జగన్‌ కోటరీ మళ్లీ హైకోర్టులో మరో కేసు వేసింది. మహా మహా 2జీ కేసులోనే సీబీఐ విచారణ, ఈడీ విచారణ రెండూ ఏకకాలంలో జరుగుతూ ఉండగా, జగన్‌ ఆర్థిక నేరాల కేసులో సీబీఐ విచారణ పూర్తయ్యేవరకు ఈడీ విచారణను ఎందుకు ఆపివేయాలంటూ న్యాయమూర్తులు ప్రశ్నించడం విశేషం. కావాలంటే సీబీఐ కేసును కూడా ఈడీ కోర్టుకు బదిలే చేసేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తాం.. మీకు ఇబ్బంది లేకుండా అన్నీ ఒకే చోట తేల్చుకోండి అన్నట్లుగా కోర్టు చెప్పేసరికి జగన్‌ న్యాయవాదులు కంగారుపడిపోయారు. అలా వద్దంటూ జగన్‌ న్యాయవాదులు కోర్టుకు అభ్యంతరం చెప్పడాన్ని బట్టి చూస్తోంటే.. ఈడీ విచారణతో జగన్‌ చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది.

ప్రస్తుతానికి ఇలా సీబీఐ కేసును ఈడీ కోర్టుకు మార్చడానికి ఈడీ వారి న్యాయవాది అభిప్రాయం కోసం కోర్టు వాయిదా వేసి ఉంది. వారి వాదన విన్న తర్వాత.. అదే తరహాలో హైకోర్టు నిర్ణయం తీసుకుంటే గనుక.. జగన్‌ పూర్తిగా ఇరుక్కుపోయినట్లే అని పలువురు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close