ఇళ‌య‌రాజాతో గొడ‌వ గురించి స్పందించిన బాలు

బాలు – ఇళ‌య‌రాజాల మ‌ధ్య మంచి దోస్తీ ఉంది. వీరిద్ద‌రిదీ యాభై ఏళ్ల అనుబంధం. బాలు పాడిన అపురూప గీతాల్లో దాదాపు 80 శాతం సూప‌ర్ హిట్స్ ఇళ‌య‌రాజా స్వ‌ర‌ప‌రిచిన‌వే. అయితే… ఆమ‌ధ్య ఈ అనుబంధానికి బ్రేక్ ప‌డింది. `నా పాట‌లు నా అనుమ‌తి లేకుండా పాడ‌డానికి వీల్లేదు` అంటూ ఇళ‌య‌రాజా బాలుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, ఈ గొవ‌డ కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌డం జ‌రిగాయి. కొన్ని వేదిక‌ల‌పై ఇళ‌య‌రాజా పాట‌ల్ని బాలు పాడ‌లేదు కూడా. అయితే ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు ఇదివర‌క‌టిలా ఇద్ద‌రూ దోస్తులు అయిపోయారు. ఈ ఎపిసోడ్ గురించి మ‌రోసారి గుర్తు చేసుకున్నారు బాలు. ఈరోజు ఓ ప్ర‌యివేటు కార్య‌క్ర‌మం నిమిత్తం హైద‌రాబాద్ వ‌చ్చారు బాలు. ఈ సంద‌ర్భంగా ఇళ‌య‌రాజా తో గొడ‌వ మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాటిపై బాలు స్పందించారు.

త‌మ మ‌ధ్య ఎప్పుడూ ఏ గొడ‌వ‌లూ లేవ‌ని, ఓ టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌ల్ల చిన్న ఇద్ద‌రి అనుబంధానికీ చిన్న విరామం వ‌చ్చింద‌ని, ఇప్పుడు అదంతా స‌మ‌సి పోయింద‌ని చెప్పారు. సోష‌ల్ మీడియా వల్ల జ‌నాల‌కు ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ద‌మో తెలియ‌కుండా పోతోంద‌ని, తామిద్ద‌రి కంటే బ‌య‌టి వ్య‌క్తులు ఎక్కువ మాట్లాడ‌డం వ‌ల్ల త‌మ స‌మ‌స్య పెద్ద‌దిగా క‌నిపించింద‌ని చెప్పుకొచ్చారు. “మేమిద్ద‌రం ఒక‌రితో ఒక‌రు క‌లిసి ప‌నిచేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. త‌న పిలుపుకోసం నేను ఎదురుచూశాను. ఆయ‌న పిలిచారు. ఇద్ద‌రం క‌లిసి ప‌నిచేయ‌డం మొద‌లెట్టాం. నేను ఆల‌పించిన గీతాల్లో స‌గానికి పైగా ఇళ‌య‌రాజా స్వ‌ర‌ప‌రిచిన‌వే. ఆ పాట‌లు పాడ‌కుండా ఎలా ఉండ‌గ‌ల‌ను? తాను సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రెండు చిత్రాల్లో పాట‌లు కూడా పాడాను” అని చెప్పుకొచ్చారు బాలు. మొత్తానికి ఇద్ద‌రు దిగ్గ‌జాల మ‌ధ్య దూరం చెరిగిపోయింది. అంత‌కంటే ఈ సంగీత ప్ర‌పంచానికి కావాల్సిందేముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close