ఫర్నీచర్ ఎపిసోడ్‌లో హైకోర్టులో కోడెల రివర్స్ పిటిషన్..!

అసెంబ్లీ ఫర్నీచర్ ను అక్రమంగా తీసుకెళ్లారంటూ.. పోలీసులు కేసు నమోదు చేయడంతో.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు… హైకోర్టును ఆశ్రయించారు. తమ వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకోవాల్సిందిగా.. అసెంబ్లీ అధికారులను ఆదేశించాలని కోడెల శిపప్రసాదరావు పిటిషన్‌లో కోరారు. ఫర్నిచర్‌ను అప్పగిస్తానని అసెంబ్లీ అధికారులకు.. జూన్‌లోనే లేఖ రాశానని అయినా పట్టించుకోలేదని… ఇప్పుడు కేసుల రూపంలో వేధింపులు ఎదురవుతున్నాయని కోడెల చెబుతున్నారు. అయితే.. కోడెల పిటిషన్‌పై… ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తంచేసింది. తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దాంతో విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కొద్ది రోజులుగా… అసెంబ్లీ ఫర్నీచర్ కు సంబంధించి కోడెలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తన దగ్గర ఫర్నీచర్ ఉందని… అధికారులు వస్తే అప్పగిస్తానని ఆయన చెబుతున్నారు.

గతంలో.. లేఖలు రాశానని కూడా చెబుతున్నారు. అయితే.. అసెంబ్లీ అధికారులు మాత్రం… కోడెల ఉన్నదని చెబుతున్న ఫర్నీచర్‌ను.. ఆయన వద్ద నుంచి తీసుకునే ప్రయత్నం చేయలేదు కానీ… కోడెల, ఆయన కుమారుడికి సంబంధించిన ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేసి.. అక్కడ వినియోగిస్తున్నారని చెబుతూ.. కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కోడెల శివప్రసాదరావు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. స్పీకర్ గా ఉన్నప్పుడు.. తన క్యాంప్ కార్యాలయాల్లో ఫర్నీచర్ ఉంచానని చెబుతున్నారు. . కారణాలు ఏమైనా… ఆయన తీవ్ర ఒత్తిడికి గురై.. ఆస్పత్రి పాలయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు మరో అడుగు ముందుకు వేసి.. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఇస్తానన్నా తీసుకోకుండా.. కుట్ర పూరితంగానే..కేసులు నమోదు చేస్తున్నారని నిర్ణయానికి వచ్చిన కోడెల కోర్టుకును ఆశ్రయించారు. అయితే.. ప్రభుత్వం.. తమ వాదన వినిపించాలని నిర్ణయించుకుంది. కేసులు పెట్టడాన్ని ప్రభుత్వం సమర్థించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా ఫర్నీచర్ ఎపిసోడ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close