రేవంత్ పవర్ బుల్లెట్ ..! “కాల్చుడు” దాకా విద్యుత్ స్కాం రాజకీయం..!

విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావును తెలంగాణ అమరవీరుల స్థూపం.. గన్ పార్క్ వద్ద నిలబెట్టి కాల్చినా తప్పు లేదని… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ను కేసీఆర్‌ ఆర్థిక వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌తో దీర్ఘకాలిక ఒప్పందం నష్టమని ఈఆర్‌సీకి గతంలో తాము ఫిర్యాదు చేశామని… అప్పటి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ కూడా కొనుగోళ్లను తప్పుబట్టారని.. అయినప్పటికీ.. తెలంగాణ సర్కార్ ముందుకే వెళ్లిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్‌ కొనుగోళ్ల వెనక అదాని హస్తం ఉందని రేవంత్‌ ఆరోపించారు. తెర వెనక అదాని.. తెర ముందు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్‌ అవినీతిపై మేం ఫిర్యాదు చేస్తాం.. విచారణ జరిపించడానికి లక్ష్మణ్‌, నడ్డా, కిషన్‌రెడ్డి సిద్ధమా అని రేవంత్ సవాల్ చేశారు. తన ఆరోపణలు తప్పైతే ఏ శిక్షకైనా నేను సిద్ధమని ప్రకటించారు. సీబీఐ విచారణకు బీజేపీని అడ్డుకుంటుందెవరని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ ఆరోపణలపై బీజేపీ కూడా ఉలిక్కిపడింది. అయితే.. చత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడకుండా…భద్రాద్రి పవర్ ప్లాంట్ అక్రమాల గురించి.. వెంటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. సీబీఐ విచారణ జరిపించుకోవాలనిసీఎండీ ప్రభాకర్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ప్రకటించారు. సీబీఐ విచారణ చేసేలా కేంద్ర పెద్దల్ని ఒప్పిస్తామన్నారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుంని… కేసీఆర్‌ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని లక్ష్మణ్‌ ప్రకటించారు.

విద్యుత్ స్కాం విషయాన్ని మొదట బీజేపీ నేతలే బయట పెట్టారు. అయితే.. మొదటగా… బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు… ప్రధానంగా.. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ విషయంలోనే. రూ. నాలుగున్నరకు వస్తూంటే.. రూ. ఐదున్నరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డి రంగంలోకి వచ్చి.. భద్రాద్రి పవర్ ప్లాంట్, చత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్లు అంశాలను తెరపైకి తెచ్చారు. దీంతో… విషయం మరింత విశాలమయింది. ఈ మ్యాటర్ ను రేవంత్ హైజాక్ చేసే పరిస్థితి కనిపిస్తూండటంతో.. లక్ష్మణ్.. సీబీఐ విచారణకు కేంద్రాన్ని ఒప్పిస్తామని.. క్రెడిట్‌ను తమ దగ్గరే ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తానికి విద్యుత్ వ్యవహారంలో.. ఏదో ఒకటి తేలడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close