మీడియా వాచ్ : వెబ్‌తో పోటీ పడి ఈనాడు చంద్రయాన్ కవరేజ్..!

దేశం అంతా ఉద్విగ్నత..! సంవత్సరాల పాటు సాగిన శాస్త్రవేత్తల కృషి… ఫలిస్తుందా.. లేదా..? అనే ఉత్కంఠ. క్షణక్షణం.. మీడియా సంస్థలు అప్ డేట్స్ ఇచ్చాయి. ఉదయమే.. పత్రికల్లోనూ వచ్చింది. కానీ అన్ని పత్రికల్లోనూ… అటూ ఇటూ కాని వార్తలే వచ్చాయి… ఒక్క ఈనాడు పత్రికలో మాత్రమే. అసలేం జరిగింది..? ఏం చేశారు..? ఏం చేయగలిగారు..? ఏం జరిగి ఉంటుందనే.. విశ్లేషణలన్నీ .. సామాన్యులకు అర్థమయ్యేలా వివరించేలా కథనాలు రాయగలిగారు. ఎం జరుగుతుందో తెలియక… ఇతర పత్రికల సంపాదక సిబ్బంది… ఎలాంటి కథనాలు రెడీ చేసుకోవాలో.. దానికి తగ్గ సాంకేతిక సమాచారం.. అందుబాటులో లేక తంటాలు పడుతూంటే… వెబ్ మీడియాతో పోటీ పడి మరీ ఈనాడు సంపూర్ణ సమాచారాన్ని ప్రింట్ రూపంలో ప్రజల్లోకి పంపింది.

ఆగస్టు 14వ తేదీన తొలి సారి చంద్రయాన్ -2 ప్రయోగాన్ని తెల్లవారుజామున జరపాలని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అంత వరకూ.. టైమ్ డెడ్‌లైన్ పెట్టుకోని కొన్ని పత్రికలు… ముందుగానే.. ప్రయోగం సక్సెస్ అయిన ప్రింట్ చేసి మార్కెట్లోకి పంపేశాయి. కానీ.. సాంకేతిక కారణాల వల్ల.. ఆ ప్రయోగం ఆగిపోయింది. కానీ మార్కెట్లోకి వెళ్లిన పత్రికల్ని మాత్రం.. వెనక్కి తెచ్చుకోలేకపోయారు. దాంతో… చాలా మీడియా సంస్థల పరువు అప్పుడే పోయింది. కానీ ఈనాడు అప్పుడు కూడా… అన్ని ఎడిషన్లలోనూ.. ప్రయోగం ఆగిపోయిందనే సమాచారాన్ని ఇచ్చింది. ఇప్పుడు.. కూడా.. ఆ విషయంలో.. తన మార్క్ ను చాటింది. విక్రమ్ ల్యాండర్ పయనం ఎలా సాగింది.. ఎక్కడ… కమ్యూనికేషన్ కట్ అయిందో.. సాంకేతిక వివరాలతో సహా .. పాఠకులకు తెలియచెప్పింది.

ఆగస్టు 14న జరిగినట్లుగా మళ్లీ జరగకూడదని అనుకున్నారేమో కానీ.. ఈ సారి పత్రికలు పెద్దగా రిస్క్ తీసుకోలేదు. ఉత్కంఠ అనే తమ తమ ప్రింట్ ఎడిషన్లలో రాసుకొచ్చాయి. ఒక్క ఈనాడులో మాత్రం… రాత్రి ఏం జరిగిందో ఫాలో కాని వారికి.. సంపూర్ణ సమాచారం ఇచ్చింది. మొత్తానికి పత్రికా ప్రపంచం.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. క్షణక్షణానికి అప్ డేట్స్ ఇచ్చే సోషల్ మీడియా… ఇతర వెబ్ మీడియాలకుపోటీగా… ప్రింట్ కూడా.. ఇంకా రేసులో ఉండగలదని.. ఈనాడు మరోసారి నిరూపించినట్లయింది. ఈనాడుతో పోటీగా… సాంకేతికకత.. నెట్ వర్క్ ఉన్నప్పటికీ.. సాక్షి పత్రిక మాత్రం.. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన వివరాలను వెల్లడించడానికే తన పత్రికలో అధిక భాగం కేటాయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close