ముందే వచ్చిన మాంద్యం..! తగ్గనున్న తెలంగాణ పద్దు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. నిన్ననే ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హరీష్ రావు.. మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ సారి బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. బడ్జెట్ పై సీఎం కేసీఆర్ జరిపిన కసరత్తుల్లోనూ మాంద్యం మాటలే ఎక్కువగా వినిపించాయి. దీంతో… పెద్ద ఎత్తున వివిధ పథకాలకు కోతలు ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు … పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు. దాంతో ఇప్పుడు.. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.1,82,017 కోట్ల పద్దును ప్రతిపాదించారు. ఈ సారి ఈ లెక్కలో కనీసం.. రూ. 17వేల కోట్ల ను తగ్గించే అవకాశం ఉంది. రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో నే పూర్తిస్థాయి బడ్జెట్‌ కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రజల్లో వస్తు, సేవల కొనుగోళ్ల శక్తి తగ్గి.. పన్నుల ఆదాయం తగ్గుతోందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది.

మొత్తంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను 8 నుంచి 12 శాతం వరకు కుదించడం ఖాయంగా కనిపిస్తోంది. రూ. 17వేల కోట్ల వరకూ కోత పడితే.. ఏ ఏ రంగాలకు కోత విధిస్తారన్నది అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే సంక్షేమ పథకాలకు.. కొన్ని నెలలుగా నిధులు అందడం లేదు. అభివృద్ధి పనుల పరిస్థితీ అంతే. రైతు బంధును పరిమితం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. బడ్జెట్ లెక్కలు తగ్గిస్తే.. ఎవరెవరికి కోత పడబోతోందన్నది కీలకంగా మారనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close