సైరా కోసం 42 సెట్లు… 64 గ్రామాలు

చారిత్ర‌క నేప‌థ్య‌మున్న క‌థ‌ల‌కు సాంకేతిక సొబ‌గులు చాలా అవ‌స‌రం. అందులోనూ క‌ళా నైపుణ్యం మ‌రింత కీల‌కం. వంద‌ల ఏళ్ల క్రితం క‌థ చెప్పాలంటే – సెట్స్‌పై ఆధార‌ప‌డాల్సిందే. `సైరా` కూడా చారిత్ర‌క గాథే. అందుకే సెట్స్‌కి చాలా ప‌ని ప‌డింది. ఈ రంగంలో సుప్ర‌సిద్ధుడిగా పేరు తెచ్చుకున్న రాజీవ‌న్‌ని క‌ళా ద‌ర్శ‌కుడిగా ఎంచుకుంది `సైరా` టీమ్‌. ఈ సినిమా కోసం ఆయ‌న ఏకంగా 42 సెట్లు వేశారు. 64 గ్రామాలకు పునఃసృష్టి చేశారు. బ్రిటీష్ కాలం నాటి తుపాకుల్ని, ఫిరంగుల్ని త‌యారు చేశారు. యుద్ధ సామాగ్రికి అయిన ఖ‌ర్చుతోనే ఏకంగా రెండు చిన్న సినిమాల్ని చేయొచ్చ‌ని చెబుతున్నారు రాజీవ‌న్‌. కేవ‌లం సెట్స్‌కోసం దాదాపుగా 30 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు స‌మాచారం.

తెర‌పై క‌నిపించే ప్ర‌తీ స‌న్నివేశానికీ సెట్ వేయ‌డం అవ‌స‌రమైంద‌ట‌. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత కాలంలో ఇళ్లు ఎలా ఉంటాయో, అప్పుడు రాయ‌ల‌సీమ వాసులు ఎలాంటి దుస్తుల్ని ధరించేవారో చెప్ప‌డానికి ఫొటోగ్రాఫ్స్ ఏమీ దొర‌క‌లేద‌ని, పుస్త‌కాల‌లో చ‌దివిన విష‌యాల్ని ఊహించి, వాటి అనుగుణంగా సెట్స్‌ని, కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశామ‌ని రాజీవ‌న్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం 22 మంది టైల‌ర్లు దాదాపు 150 రోజుల పాటు క‌ష్ట‌ప‌డి 15 వేల దుస్తుల్ని డిజైన్ చేశారు. తెర‌పై ప్ర‌తీదీ స‌హ‌జంగా క‌నిపించాల‌న్న త‌ప‌న‌తో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, అలాగ‌ని చ‌రిత్ర‌కు దూరంగా వెళ్ల‌లేద‌ని క‌ళా ద‌ర్శ‌కుడు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close