న‌రేష్‌పై ఆరోప‌ణ‌లు ఇవేనా?

‘మా’లో మొద‌లైన అల‌జ‌డి ‘మా’ టీమ్ మొత్తాన్ని రెండు వ‌ర్గాలుగా చేసేసింది. ఒక‌టి న‌రేష్ వ‌ర్గం, రెండోది రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం. ‘మాలో గొడ‌వ‌లేం లేవు’ అని చెబుతున్నా – లోప‌ల జ‌ర‌గాల్సిన తంతు జ‌రిగిపోయింది. న‌రేష్‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో కార్య‌వ‌ర్గ స‌మావేశం గంద‌ర‌గోళంగా మారిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్‌.

న‌రేష్‌పై ప్ర‌ధానంగా రెండు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

1. ‘మా’ కోసం స‌మ‌యం కేటాయించ‌డం లేదు.
2. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం

ఈ రెండింటిపైనా న‌రేష్ విశ్లేష‌ణ‌పూర్వ‌క‌మైన వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మా `మినిట్స్ బుక్‌`, పంచింగుల డేటా ఆయ‌న ‘మా’ స‌భ్యుల ముందుకు తీసుకొచ్చారు. ‘మా’ కోసం ఎవ‌రు ఎన్ని రోజులు ఛాంబ‌ర్‌కి వ‌చ్చారో లెక్క వేసుకోమ‌న్నారు. ఇక రెండో విష‌యం.. ఏక ప‌క్ష నిర్ణ‌యాలు. ఇప్ప‌టి వ‌ర‌కూ ‘మా’ కోసం ఎన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు? వాటిలో చ‌ర్చించి తీసుకున్న‌వెన్ని, అధ్య‌క్ష హోదాలో న‌రేష్ తీసుకున్న‌వెన్ని ? అనే విష‌యంపై స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ఈ ఆరోప‌ణ కూడా నిల‌బ‌డ‌లేక‌పోయింది.

జీవిత – రాజ‌శేఖ‌ర్‌లు న‌రేష్ వ‌ర్గంలో నిల‌బ‌డి గెలిచిన‌వాళ్లు. నిజానికి ఆ ఇద్ద‌రికీ `మా` ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డాల‌న్న ఆలోచ‌నే లేదు. అయితే న‌రేష్ ప‌ట్టుబ‌ట్టి వాళ్లిద్ద‌రినీ నిల‌బెట్టాడు. వాళ్లు మంచి మెజార్జీతో గెలిచి ‘మా’ ప్యానెల్‌లో కీల‌క స‌భ్యుల‌య్యారు. ఇప్పుడు వాళ్లే న‌రేష్ ని కార్న‌ర్ చేయ‌డం విశేషం. న‌రేష్ ఎన్నిక‌ల‌లో గెలిచి.. ‘మా’ అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహించాడు. త‌న‌పై అవిశ్వాస తీర్మాణం పెట్టి గ‌ద్దె దింప‌డం అంత తేలికైన విష‌యం కాదు. అందుకే పెద్ద‌లు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాన్ని శాంత‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించార‌ని స‌మాచారం. ఏ విష‌య‌మైనా కూర్చుని మాట్లాడుకోవాల‌ని, గొడ‌వ ప‌డితే.. అలుసైపోతార‌ని స‌ముదాయించార్ట‌. దాంతో… రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close