వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారట..!

సమస్యలు పరిష్కరించండి మహా ప్రభో.. ప్రజల్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది..! .. ఇది విశాఖలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల మొర. ఇది ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం కాదు. ఏపీ మొత్తం ఎమ్మెల్యేల ఆందోళన ఇదే. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నేతలు.. ఇలాంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు.. నేరుగా… అధికార పార్టీ నేతలే.. దీన్ని తమ ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. మూడున్నర నెలల కాలంలోనే.. ప్రజలను ఎదుర్కోలేనంత.. అసంతృప్తి.. వైసీపీ సర్కార్ పై ఏర్పడిందని.. ఎమ్మెల్యేలకు కూడా అర్థమైపోయింది. ఎందుకిలాంటి పరిస్థితి వచ్చిందంటే.. అన్నీ.. స్వయంకృతంగా ప్రజలకు తెచ్చి పెట్టిన ఇక్కట్ల వల్లే.

రగిలిపోతున్న భవన నిర్మాణ కార్మికులు..!

భవన నిర్మాణ కార్మికులు.. అత్యధికంగా వైసీపీకి మద్దతుగా ఓటేశారనేది.. రాజకీయవర్గాల విశ్లేషణ. అలాంటి వారి మెరుగు కోసం… ఏదో ఒకటి చేయాల్సిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వారి కడుపుకొట్టేసింది. ఇసుకను నిలుపుదల చేయడంతో.. మూడున్నర నెలలుగా వారు ఉపాధి కోల్పోయారు. బేల్దారి కార్మికుల కుటుంబాలాన్నీ అప్పులపాలయ్యాయి. ఏపీలో ఏ భవన నిర్మాణ కార్మికుడితో మాట్లాడినా… కడుపు కాలిపోతున్న .. ఆవేదనే కనిపిస్తోంది. తమ పార్టీ నేతలకు.. ఇసుకను దోచి పెట్టి.. బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి తమ కడుపుకొట్టారనే ఆవేదన భవన నిర్మాణ కార్మికుల్లో కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యేలు తమ ఎదురుగా వస్తే.. వారు ఊరుకుంటారా..?

నవరత్నాల అమలు ప్రారంభం కాకపోవడంతో టెన్షన్..!

జగన్మోహన్ రెడ్డి… మాటల్లో ఎన్నో చెప్పారు. పథకాలన్నీ డోర్ డెలివరీ అన్నారు. ఇప్పటికి శ్రీకాకుళం జిల్లాలో.. సన్నబియ్యం ఉరఫ్ నాణ్యమైన బియ్యాన్ని బస్తాల్లో మాత్రమే చేశారు. ప్రతీ నెలా పించన్లు లేటవుతున్నాయి. రేషన్ కార్డుపై గతంలో.. కొన్ని సరుకులు వచ్చేవి. ఇప్పుడు వాటిని కోసేశారు. ప్రకటించిన నవరత్నాల అమలు ఇంకా ప్రారంభం కాలేదు. లబ్దిదారుల ఎంపిక పేరుతో… కొన్ని పథకాలు.. అందరికీ చేరకుండా… చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో అసహనానికి గురి చేస్తున్నాయి.

కనీస పనులు కూడా చేయలేకపోతున్న ఎమ్మెల్యేలు..!

మా ఊళ్లో నిర్మాణంలో ఉన్న రోడ్డు ఆగిపోయింది. మా ఊళ్లో రోడ్డు పాడైపోయింది. గత సర్కార్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి కింద సాయం చేయండి.. ఇలా ఎమ్మెల్యేల వద్దకు ప్రజలు.. రకరకాల విజ్ఞాపనలతో వస్తారు. కానీ.. ఒక్కటంటే.. ఒక్క పనినీ ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులన్నింటినీ నిలిపి వేసింది. దేనీకి డబ్బులివ్వడం లేదు. కనీసం రోడ్ల మరమ్మతులకి కూడా. దీంతోనే… వారు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొంత మంది అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే వద్దంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..!

ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని.. గత ప్రభుత్వంతో పోల్చుకుని.. ప్రజలు మూడున్నర కాలంలోనే.. ఎక్కువ అంచనాలతో.. ఉన్నారని.. కానీ ఇప్పుడు అందుకోలేకపోయామని.. వైసీపీ నేతలు అంచనాకు వచ్చారు. అందుకే..ఇప్పుడే.. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు పెడితే.. మొదటికే మోసం వస్తుందని.. ఇప్పుడు ఎలాంటి ఎన్నికల ఆలోచనలు చేయవద్దని చెబుతున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే.. ఆ ఎన్నికల సన్నాహాలను.. తూ.. తూ మంత్రంగా చేస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close