జ్ఞాపకానికే గాంధీ గొప్ప..! ఎవరికీ పట్టని మహాత్ముని బాట ..!

ఉదయం మహాత్ముని స్మరణతో నిద్రలేచింది దేశం. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ అందరూ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి నివాళులర్పిస్తున్నారు. ప్రోఫైల్‌ పిక్స్‌లు మార్చేసుకున్నారు. ఆయన సిద్ధాంతాలు ఎంత గొప్పవో.. తమకు తెలిసిన భాషల్లో వ్యక్తీకరిస్తున్నారు. ఆయన ఎందుకు మహాత్ముడయ్యారో.. విశ్లేషిస్తున్నారు. ప్రధాన పత్రికలు.. ఆయన గురించి పేజీలకు పేజీలు కొత్త.. కొత్తగా రాశాయి. కానీ.. ఇలా చెబుతున్న వారిలో … మహాత్ముని గురించి గొప్పగా చెబుతున్న వారిలో.. ఆయన సిద్ధాంతాలు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టాయని వాదిస్తున్న వారిలో… కొందరంటే.. కొందరైనా.. వాటిని పాటించే ప్రయత్నం చేస్తున్నారా..? అంటే.. ఒక్కరైనా.. గుండెల మీద చేయి వేసుకుని గాంధీబాటన పయనిస్తున్నాం.. అని చెప్పే పరిస్థితి లేదు.

మహాత్ముని జ్ఞాపకాల్లో దేశం..! మనస్ఫూర్తిగానేనా..?

అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన గాంధీ.. అద్భుతాలే చేశారు. ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపమన్న ఆయన సిద్ధాంతమే … స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది. బ్రిటిషన్ల మనసుల్లో మార్పు తెప్పించి.. ఆయన స్వాతంత్ర్యం తెప్పించారు. అప్పట్లో.. ఆయన విధానాలను వ్యతిరేకించిన వారున్నారు. బుల్లెట్‌ను బుల్లెట్‌తోనే తీయాలన్న సిద్ధాంతాన్ని అమలు చేయాలని వాదించిన వారున్నారు. వారందరూ.. చివరికి హింసతో సాధించేదేమీ లేదని రియలైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు.. అందరిదీ ఒకటే బాట. హింసతోనే ఏదైనా సాధ్యమని నమ్ముతున్నారు. దేశం మొత్తం ఏకతాటిపైకి ఉండాలన్నది మహాత్ముని కల. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు… కుల, మత, ప్రాంతాల ఆధారంగా.. ప్రజలను నిట్ట నిలువుగా చీల్చేసి.. దేశంలోనే ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టేస్తున్నారు. ఫలితంగా.. గాంధీ కలలుకన్నా భారత్.. ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఆవిష్కృతం కాలేదు.

గాడ్సేకు పొడిగిన వాళ్లకు మద్దతెలా లభించింది…?

గాంధీ మహాత్ముడ్ని గాడ్సే చంపేశాడు. ఆ గాడ్సేని… తర్వాత ఉరి తీశారు. కానీ ఆ గాడ్సే భావజాలాన్ని మాత్రం అంతం చేయలేకపోయారు. స్వాతంత్రం వచ్చి… గాంధీ మహాత్ముడు ప్రాణ త్యాగం చేసిన డెబ్భై ఏళ్ల తర్వాత.. ఆ భావజాలం ఇప్పుడు.. ఇంతింతే వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. గాడ్సేను మహాత్ముడిగా పూజించేవారు పెరిగిపోవడమే దీనికి నిదర్శనం. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ..ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అనే నేత.. మహాత్ముడ్ని చంపడం.. గాడ్సే చేసిన మంచి పని అన్నట్లుగా మాట్లాడారు. ఆమె మాటలు దేశ ప్రజల్ని షాక్‌కు గురి చేస్తే… కొంత మందికి మాత్రం ఉత్సాహాన్నిచ్చాయి. చరిత్ర గురించి.. గాంధీ పోరాటం గురించి ఏ మాత్రం తెలియని వాళ్లు.. ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. గాడ్సేకు అనుకూలంగా ప్రకటన చేశారు. అక్కడే దేశంలో స్పష్టమైన విభజన లేఖ కనిపించినట్లయింది. ఈ భావజాలాన్ని తుంచి వేయడం అంత సాధ్యం కాదు.

ప్రజల మధ్య విభజన తీసుకురాకపోవడమే ఆయనకు అసలైన నివాళి..!

గాంధీ జయంతి రోజు.. ఆయనను గొప్పగా గుర్తు చేసుకుంటున్నారు. ఒక పండుగలా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ప్రోఫైల్ పిక్‌లు మార్చడం… గాంధీకి నివాళి అర్పించడం కాదు. దేశాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడం ముఖ్యం. దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులు. దేశంలో ప్రజలందరి మధ్య ఏకతాభావం వచ్చేలా వ్యవహరించడమే గాంధీకి నివాళి. కుల, మత, ప్రాంత వర్గ బేధాలతో ఒకరికొకరు దూరమైపోవడం.. గాంధీ సిద్ధాంతం కాదు. రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం.. ఈ విద్వేషాలు పెంచుతున్నాయి. అయినా వారు గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా అనుసరించిన రోజే.. ఆయనకు నిజమైన.. ఘనమైన నివాళి అర్పించినట్లు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close