లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌డం క‌రెక్టేనా?

మెగా కాంపౌండ్ దృష్టి… మ‌ల‌యాళ చిత్రం `లూసీఫ‌ర్‌`పై ప‌డింది. మోహ‌న్‌లాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మ‌ది. ఓ కీల‌క‌పాత్ర‌లో ఫృథ్వీ రాజ్ న‌టించారు. ఈ సినిమాని రీమేక్ చేస్తున్నామ‌ని ఇది వ‌ర‌కే చిరంజీవి ప్ర‌క‌టించారు. మోహ‌న్‌లాల్ పాత్ర‌లో చిరు, ఫృథ్వీరాజ్ గా చ‌ర‌ణ్ న‌టించ‌బోతున్నారు. తండ్రీ కొడుకుల్ని ఒకే ఫ్రేమ్‌లో చూడ‌డం మెగా అభిమానుల‌కు పండ‌గే. లూసీఫ‌ర్ మ‌ల‌యాళంలో బాగా ఆడింది. మంచి డ‌బ్బులొచ్చాయి కూడా.

కాక‌పోతే.. ఇది తెలుగు నేటివిటీకి ప‌నికొస్తుందా, లేదా? అనేదే పెద్ద డౌటు. గాడ్ ఫాద‌ర్‌లాంటి క‌థ ఇది. తెలుగు సినిమాకి కావ‌ల్సిన హంగులు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తాయి. మోహ‌న్ లాల్ పాత్ర స్టైలీష్‌గా ఉంటుంది గానీ, డైలాగులు త‌క్కువ‌. ఫృథ్వీరాజ్ పాత్ర కూడా సినిమా చివ‌ర్లో వ‌స్తుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే అతిథి పాత్ర‌. క‌థ‌లో క్రీస్టియ‌న్ వ్య‌వ‌హారాలు చాలా ఎక్కువ‌. సినిమా స్లో పేజ్‌లో న‌డుస్తుంటుంది. ఓ తండ్రి కూతుర్ని శారీర‌కంగా ఇబ్బంది పెట్టాల‌ని చూస్తుంటాడు. ఇవ‌న్నీ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారాలు. అన్న‌ట్టు ఈ సినిమా తెలుగులో అదే పేరుతో డ‌బ్ అయ్యింది. కానీ ఒక‌ట్రెండు రోజుల‌కు మించి ఆడ‌లేదు. ఇదే క‌థ‌ని తెలుగులోకి తీసుకురావాలంటే చాలా మార్పులు చేయాలి. అలా చేస్తే… క‌థ‌లో ఫీల్ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. మోహ‌న్ లాల్ పాత్ర‌కు చిరు నూటికి నూరుపాళ్లు స‌రిపోతాడు. కాక‌పోతే.. చిరంజీవి సినిమా నుంచి ఆశించే అంశాలు ఇందులో క‌నిపించ‌వు. అయినా స‌రే, చిరు ఈ సినిమా రీమేక్ చేయాల‌ని అనుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. కాక‌పోతే… ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ సినిమా పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాత త్రివిక్ర‌మ్ సినిమా ఉంది. ఇవి పూర్త‌వ్వాలి. ఆ త‌ర‌వాతే లూసీఫ‌ర్ మొద‌ల‌వ్వాలి. ఈలోగా ఏమైనా జ‌ర‌గొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close