‘పలాస’ పై ఓ లుక్ పడింది

సినిమాలో కంటెంట్ వుంటే చాలు.. ఆటోమేటిక్ గా మార్కెట్ వస్తుంది. ముఖ్యంగా మీడియం, చిన్న బడ్జెట్, కొత్త వాళ్ళు తీసే సినిమాల మార్కెట్.. అందులో వున్న కంటెంటే. కొన్ని సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పుడే మంచి కంటెంట్ వుంటే గనుక ఇండస్ట్రీలోకి పాజిటివ్ వేవ్స్ తీసుకెళ్లగలుగుతాయి. ‘ఘాజీ ‘సినిమా తీసిన సంకల్ప్ రెడ్డి.. ఊరు చివర ఓ సెట్ వేసుకొని షూట్ చేస్తుండగా .. ఇదేదో విషయం సినిమాలా ఉన్నట్లుందని.. దాన్ని తీయడానికి రానా లాంటి వాళ్ళు ముందుకువచ్చారు.

ఇక రెండోది.. టీజర్, ట్రైలర్. చిన్న టీజర్ తో కూడా ఇండస్ట్రీ దృష్టిని తిప్పుకోవచ్చు. ఇప్పుడలా ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్న సినిమా ‘పలాస’1978. ప్రముఖ కధా రచయిత కరుణ కుమార్ దర్శకత్వం. మొన్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ సినిమా టీజర్ ని రివిల్ చేశారు. చాలా ఇంట్రస్టింగ్ గా వుంది టీజర్. ఓ బలమైన కధని చూపించబోతున్నారని అర్ధమౌతుంది. టీజర్ అంతా ఒక మూడ్ ని ఎలివేట్ చేసింది. విజువల్స్, లోకేషన్స్, నటీనటుల కనిపించిన తీరు, నేపధ్య సంగీతం అన్నీ క్యాలిటీగా వున్నాయి. దీంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది పలాస. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ప్రివ్యూ కోసం యూనిట్ ని సంప్రదించినట్లుగా తెలిసింది.

రూరల్ నేపధ్యంలో సినిమాలు హిందీ, తమిళ్ లో విరివిగా వస్తుంటాయి. అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకులని స్టార్స్ ని చేసింది కూడా ‘గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్’ లాంటి రూరల్ సినిమానే. ఇక తమిళ్ లో చెప్పనక్కర్లేదు. ఏడాదికి కనీసం నాలుగైదు రూరల్ హిట్స్ వుంటాయక్కడ. ఇప్పుడు తెలుగులో కూడా అ ట్రెండ్ మొదలైతే .. అచ్చమైన తెలుగు కధలు మరిన్ని వస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close