“మేఘా”లో సోదాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం..!

మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న సోదాల విషయం ముందుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులెవరికీ తెలియదు. ప్రత్యేకంగా మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో సోదాల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఓ బృందం వచ్చింది. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల కూడా.. కాంట్రాక్ట్ పనులు చేస్తున్న మేఘా కృష్ణారెడ్డి .. ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో పొదుపుగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేశంలోనే అత్యంత ధనవంతులైన వారి జాబితాలో ఉన్న మేఘా కృష్ణారెడ్డి, పాపిరెడ్డిలు.. మరీ తక్కువగా ముందస్తు పన్ను చెల్లించడమేమిటన్న అనుమానాలు ఐటీ వర్గాలకు వచ్చాయి. వెంటనే ఆ మేఘా కృష్ణారెడ్డి చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలు సేకరించి… ఇప్పటి వరకూ ప్రభుత్వాల నుంచి పొందిన బిల్లుల వివరాలు కూడా.., తెలుసుకుని.., అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించుకుని రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం ఉదయం ప్రారంభమైన సోదాలు… అర్థరాత్రి దాటినా పూర్తి కాలేదు. పలు కీలకమైన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లభించడం.. వాటికి సంబంధించిన అదనపు సమాచారం… తెప్పించడంతో… అధికారులు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెఘా కృష్ణారెడ్డికి చెందిన…దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్లో సోదాలు జరిగినట్లుగా ప్రచారం జరిగింది కానీ… అలాంటిదేమీ లేదని.. ఐటీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆయన ప్రధాన కార్యాలయంలోనే మాత్రమే సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో బయటపడే విషయాలను బట్టి.. మిగతా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా… ఎంతో పక్కా ఆధారాలు ఉంటే తప్ప… ప్రత్యేక బృందాలను… ఐటీ వినియోగించదు. ఇటీవలి కాలంలో మీడియా విలీనాలు.. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీలను కొనడం వంటివి మేఘా కృష్ణారెడ్డి చేశారు. దాంతో.. ఆ లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మేఘా కృష్ణారెడ్డి విషయంలో.. ఇటీవలి కాలంలో.. అనేక వివాదాలు వెలుగు చూస్తున్నాయి. టీవీ9 కొనుగోలు వ్యవహారం … పోలవరం రివర్స్ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటిపై మేఘా కృష్ణారెడ్డి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఇప్పుడు మాత్రం.. ఐటీ దాడులు రొటీన్ చెకప్‌నేనని మీడియాకు సమాచారం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close