శ్రీ‌కాంత్ అడ్డాల‌ని ఇర‌కాటంలో ప‌డేసిన మారుతి

పాపం.. శ్రీ‌కాంత్ అడ్డాల‌కు అస్స‌లు టైమ్ క‌ల‌సి రావ‌డం లేదు. కావల్సినంత టాలెంట్ ఉన్నా, క్లాస్ సినిమాల ద‌ర్శ‌కుడు అని పేరు తెచ్చుకున్నా, ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర ఒక్క సినిమా కూడా లేదు. గీతా ఆర్ట్స్ పిలిచి అవ‌కాశం ఇచ్చినా, హీరోని ప‌ట్టుకోలేక‌పోతున్నాడు. క‌థ‌లు రెడీ చేస్తున్నా – అవి గీతా ఆర్ట్స్‌కి ఏమాత్రం ఎక్క‌డం లేదు. ఈమ‌ధ్య ఓ ఫ్యామిలీ డ్రామాని సెట్ చేసి అల్లు అర‌వింద్‌కి వినిపించాడ‌ట‌. ఆ క‌థ బాగానే ఉన్నా, స‌రిగ్గా అలాంటి లైన్‌తోనే మారుతి `ప్ర‌తిరోజూ పండ‌గ‌` చేస్తుండ‌డంతో ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టేయాల్సివ‌చ్చింది. నిజానికి ఈ క‌థ‌ని రెండేళ్ల క్రిత‌మే రాసుకున్నాడ‌ట శ్రీ‌కాంత్‌. అప్పుడే అల్లు అర‌వింద్‌కి వినిపించి ఉంటే బాగుండేది. అన్న‌ట్టు.. మారుతి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కుతోంది. ఓ సంస్థ‌కు ప‌నిచేస్తున్న ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఒకేలాంటి కథ‌ని అల్లు అర‌వింద్‌కి వినిపించార‌న్న‌మాట‌. తొలి అడుగు మారుతిది ప‌డింది కాబ‌ట్టి, ఆ ప్రాజెక్టు సెట్ అయ్యింది. కాస్త లేట్ చేయ‌డం వ‌ల్ల‌.. శ్రీ‌కాంత్ క‌థ ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. ఒకే థాట్ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు వ‌చ్చిందంటే… ఈ క‌థ‌కు స్ఫూర్తి ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. మారుతి వ‌ల్ల‌… ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల క‌థ మార్చుకోవాల్సివ‌స్తోంది. మ‌ళ్లీ క‌థ రెడీ చేయ‌డానికి ఎంత టైమ్ తీసుకుంటాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close