ఐయామ్‌ సారీ.. ఇక ఆర్టీసీని మర్చిపోవాల్సిందే: కేసీఆర్‌

ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే పరిష్కారమని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చేశారు. ఇక ఆర్టీసీ పని అయిపోయింది.. ఎవ్వరూ కాపాడలేరని డిక్లేర్ చేశారు. ఐదారు రోజుల్లో ఒక్క సంతకంతో.. నిర్ణయం తీసేసుకుంటామని ప్రకటించారు. హుజూర్ నగర్ ఎన్నిక ఫలితంపై స్పందించేందుకు.. తెలంగాణ భవన్ లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన కేసీఆర్… ఆర్టీసీ సమ్మెపై తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. కార్మిక సంఘాల నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మెని తేల్చారు. ఆర్టీసీ కార్మికులది అర్థంపర్థం లేని దురహంకార వైఖరన్నారు. నిధుల సమీకరణ కోసం.. విలువైన భూముల్ని అమ్మేందుకు కార్యాచరణ సిద్ధమవుతోందని ప్రకటించారు. 21శాతం ఉన్న వృద్ధిరేటు 2 శాతానికి పడిపోయిందని ఇలాంటి సమయంలో ఆలోచనతో వ్యవహరించాలన్నారు. ఇంత క్లిష్ట సమయంలో ఆర్టీసీ కార్మికుల వైఖరిని ఎట్టిపరిస్థితుల్లో సమర్థించనని స్పష్టం చేశారు.

డిమాండ్లపై స్పందించి కమిటీ వేస్తే లంగ ప్రచారం చేశారని .. ఎంత సమయం తీసుకుంటారని యాగీ మొదలుపెట్టారని.. పరిష్కారానికి సమయం పట్టదా అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవని చెబితే హైకోర్టు కొట్టదని.. ఆర్టీసీ సమ్మెపై తీర్పు చెప్పే అధికారం అలవు హైకోర్టుకు లేదన్నారు కేసీఆర్‌. నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు రెండుసార్లు ఐఆర్‌ ఇచ్చామని … ఏ రాష్ట్రంలోనూ 4 ఏళ్ల వ్యవధిలో 67శాతం జీతాలు పెంచలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది అర్థంలేని డిమాండ్‌ గా తేల్చారు. తెలంగాణ 54 కార్పొరేషన్లు ఉన్నాయి..విలీనం చేయమని రేపు వాళ్లు అడుగుతారనన్నారు. ఆర్టీసీని భరించలేక చాలా రాష్ట్రాలు వదిలించుకుంటున్నాయని.. బెంగాల్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో ఆర్టీసీ నామమాత్రమేనని గుర్తు చేశారు. ఆర్టీసీ యూనియన్ల పేరుతో వాళ్లు చేస్తోంది మహానేరంగా తేల్చిన కేసీఆర్.. ఆర్టీసీని స్వయంగా వాళ్లే ముంచుకుంటున్నారన్నారు. ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని.. ఇక ఆర్టీసీకి భవిష్యత్‌ లేదన్నారు.

ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం కాబట్టి.. సమ్మె చేయించినవాళ్లే బాధ్యలని తేల్చారు. ఐదారు రోజుల్లో సమ్మెపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేబినెట్‌ సమావేశం అవసరం లేకుండా ఒక్క సంతకంతో పనైపోతుందన్నారు. ఒక్క పర్మిట్‌ ఇచ్చామంటే .. ఇంతకంటే తక్కువ ఛార్జీలతో ప్రజలకు మెరుగైన రవాణా వస్తుందన్నారు. ఒక్క సంతకం పెట్టి ప్రైవేట్‌ బస్సులను రంగంలోకి దింపుతామని. . అది ఆర్టీసీనా గీర్టీసీనా అనేది మాకు అనవసరని తేల్చేశారు. ఆర్టీసీ విలీనం అసంభవమన్న కేసీఆర్‌ … ఏపీ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆర్టీసీ విలీనంతో ఏపీలో ఒక ప్రయోగం చేశారని… అక్కడ మన్ను కూడా జరగదన్నారు. ఏమవుతుందో 3నెలలకో 6నెలలకో తేలుతుందన్నారు. చివరకు కార్మికులకు కేసీఆర్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరే అవకాశం ఇచ్చారు. దరఖాస్తులు పట్టుకుని డిపోల్లోకి వచ్చి డ్యూటీల్లో చేరితే ఎవరూ వెళ్లగొట్టరని ఆఫర్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close