వల్లభనేని వంశీ “రివర్స్” కేసులు ..!

నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదు చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది వైసీపీ నేతలు, ఎమ్మార్వో చేసిన కుట్రని.. డీఎస్పీ భాగస్వామ్యమయ్యారని.. టెక్నికల్ ఆధారాలు సేకరించారు. వాటిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.  గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత రవికమార్ హనుమాన్ జంక్షన్ ఎమ్మార్వోకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదులో నకిలీ పట్టాల పంపిణీ చేశారని ఉంది. అయితే ఎమ్మార్వో.. ఇలాంటి ఫిర్యాదు తనకు వస్తుందని… తెలుసో ఏమో కానీ.. వెంటనే.. దాన్ని  హనుమాన్ జంక్షన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫార్వార్డ్ చేశారు. అసలు నకిలీ పట్టాలు పంపిణీ చేశారా..? చేస్తే ఎవరు చేశారు..? అందులో వల్లభనేని వంశీ పాత్ర ఉందా..? లాంటివేమీ విచారణ చేయలేదు. పోలీసులు కూడా.. ఆ ఫిర్యాదు కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కేసు పెట్టేశారు. పదో నిందితుడిగా ఉన్న వంశీని అరెస్ట్ చేస్తామంటూ మీడియాకు సమాచారం లీక్ చేస్తున్నారు.
 
దీంతో వంశీ… ఈ మెయిల్ రికార్డులను సేకరించారు. మొదటగా ఆ ఫిర్యాదు కాపీ రవి కుమార్ నుంచి ఎమ్మార్వోకి వచ్చిందని గుర్తించారు. కేవలం తనను టార్గెట్ చేసుకుని కొంతమంది వైసిపి నాయకులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నరని, అవి ఇప్పుడు ఆధారాలతో సహా రుజువు చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని వంశీ ప్రకటించారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును నేరుగా ఎలా ఎఫ్ ఐ ఆర్ గా నమోదు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ హరిచందన్, హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ను కలిసి తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తానని తెలిపారు. కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను, డిఎస్పీని, ఎమ్మార్వోని, వెంటనే సస్పెండ్ చేయాలని వంశీ డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ కేసులపై పోరాటంలో తాము అంతా అండగా ఉంటామని కార్యకర్తలు వంశీకి భరోసా ఇచ్చారు. టీడీపీ నేతల్ని  అక్రమ కేసుల్లో ఇరికించి.. పార్టీ మారేలా ప్రొత్సహించేందుకు.. అధికారులు, పోలీసులతో కలిసి… వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వంశీపై కేసు టీడీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. తప్పుడు కేసులపై పోరాటానికి వంశీ సేకరించిన సాక్ష్యాలు కీలకంగా మారుతాయని  భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close