వంశీ అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు ఇబ్బందే..!

వల్లభనేని వంశీ వైసీపీలో చేరికతో.. జూనియర్ ఎన్టీఆర్‌కు మరిన్ని ఇబ్బందులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన వారు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీరిలో కొడాలి నాని ఎప్పుడో టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలో… జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహం కూడా ఉందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం లాంఛనమేనన్న చర్చ జరుగుతోంది. 2012లో ఓ సందర్భంలో జగన్ ఎదురుపడినప్పుడు.. ఆప్యాయంగా… వెలిగిపోయే ముఖంతో.. ఆలింగనం చేసుకున్నప్పుడే.. వంశీ.. అటు వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పటికే ఆప్తమిత్రుడైన కొడాలి నాని వైసీపీలో చేరి చంద్రబాబును చెడామడా తిడుతున్నారు. ఈ కారణంగానే…2014లో చంద్రబాబు వంశీకి గన్నవరం టిక్కెట్ ఇవ్వడానికి తటపటాయించారు. కానీ.. పరిటాల సునీతతో ఒత్తిడి చేయించుకుని మరీ… వల్లభనేని వంశీ టిక్కెట్ తెచ్చుకున్నారు.

అప్పుడు అధికారంలోకి రావడంతో.. వంశీకి ఇబ్బందులు ఎదురు కాలేదు. నియోజకవర్గానికి అడిగిన పనులన్నీ చేయించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ గెలిచారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు… ఇతర వ్యవహారాలతో… ఆయన ఎన్నికల నుంచి డ్రాప్ అవుతారని.. అప్పుడే వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ.. టీడీపీలోనే నిలబడి గెలిచారు. ఇప్పుడు.. మాత్రం.. ఒత్తిడి తట్టుకోలేక… వైసీపీలో చేరిపోవడానికి రెడీ అయ్యారు. కొడాలి నాని దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఆప్తులందరూ వైసీపీలో చేరుతూండటంతో.. టీడీపీ క్యాడర్‌లో ఆయనపై.. సానుకూలత ఏర్పడే అవకాశం లేదు. ఆయన గతంలో.. టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరారు. ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్‌కు.. భవిష్యత్‌లో ఇబ్బందికర పరిణామాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close