వంశీ లేఖకు.. చంద్రబాబు మార్క్ రిప్లయ్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులు, అధికారులు కేసులు పెట్టి వేధిస్తూండటం వల్ల.. అనుచరుల్ని ఇబ్బంది పెట్టలేక.. రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ రాయడంపై.. చంద్రబాబు స్పందించారు. వంశీ.. వాట్సాప్ ద్వారా తన లేఖను పంపారు. చంద్రబాబు కూడా.. అదే విధంగా.. తన రిప్లయ్ ఇచ్చారు. అధికారులు వేధిస్తున్నారంటూ… రాజీనామా చేయడం సరి కాదని.. పేద ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల నుంచి విరమించుకున్నంత మాత్రాన.. వదిలి పెట్టరని.. వేటాడతారని గుర్తు చేశారు. రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన చర్య కాదని స్పష్టం చేసారు. ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా.. పార్టీ తరపున అండగా హామీ ఇచ్చారు.

టీడీపీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. వంశీ వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారుల వేధింపుల వల్లే తానీ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. వైసీపీలో చేరతారనుకున్న వైసీపీ లేఖ ఆ పార్టీకి ఇబ్బంది కరంగా మారింది. ఇప్పటికే టీడీపీ నేతలపై అనేక రకాల వేధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. అవే తరహా ఆరోపణలు చేసి.. రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకోవడంతో… వైసీపీలోనూ.. కలకలం రేపుతోంది. జగన్ దగ్గరకు తీసుకుపోయిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. వంశీ లేఖతో ఇబ్బంది పడటం ఖాయంగా తెలుస్తోంది.

ఏ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని.. ఆరోపించి.. టీడీపీకి రాజీనామా చేశారో.. ఇప్పుడు అదే పార్టీలో వంశీ చేరడం.. ఇబ్బందికరమే. అయితే.. ఈ విషయంలో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది. ఇప్పటికే పరిటాల రవి అనుచరునిగా.. వల్లభనేని వంశీకి కొంత ఇమేజ్ ఉంది. ఇప్పుడు పోయి..పోయి ఆయన వైసీపీలో చేరితే.. క్యారెక్టర్ పై మచ్చ పడుతుంది. అదే సమయంలో… టీడీపీలో ఉండి.. ఆయన వైసీపీ నేతల వేధింపుల్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. వంశీ ముందు ముందు తీసుకోబోయే నిర్ణయం హాట్ టాపిక్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close