బెంగళూరు ఘటనపై రాహుల్ స్పందించరు. ఎందుకంటే…

బెంగళూరు నగరంలో పట్టపగలు టాంజానియాకి చెందిన ఒక విద్యార్ధినిని కొందరు బట్టలూడదీసి రోడ్డు మీద పరుగులు తీయిస్తే, అటువంటిదేమీ జరుగలేదని కర్నాటక రాష్ట్ర హోంమంత్రి సమర్ధించుకోవడం సిగ్గు చేటు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్నాటక ప్రభుత్వం సంఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మొదలుకొని అదనపు కమీషనర్ ఆఫ్ పోలీస్ అశ్వద్ నారాయణ వరకు చాలా మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అంతటితో దాని కర్తవ్యం పూర్తయినట్లు మాట్లాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కనుక వారినీ తప్పు పట్టడానికి లేదు.

అందరూ ఎవరి పని వారు చేస్తున్నట్లు, అంతా సవ్యంగానే ఉన్నట్లు పైకి కనబడుతోంది. కానీ మహిళా ఉద్యోగినులపై అత్యాచారాలు, పట్టపగలే ఇటువంటి దారుణ సంఘటనలు, ఉగ్రవాదులకు మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ చెపుతున్న మత అసహనం వంటివన్నీ ఎక్కువగా బెంగళూరు నగరంలోనే తరచూ కనిపిస్తుంటాయి. కానీ వాటిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఎన్నడూ మాట్లాడరు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

మన దేశంలో చదువుకోవడానికి వచ్చిన ఒక విదేశీ విద్యార్ధినికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇంత ఘోర అవమానం జరిగితే రాహుల్ గాంధి కనీసం దాని గురించి మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపకపోవడం చాల శోచనీయం. అది ఆయన ద్వంద నీతికి అద్దం పడుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున డిల్లీలో ప్రేలుళ్ళకు కుట్రలు పన్నుతున్న వారిని బెంగళూరు నుండే ఎన్.ఐ.ఏ. అధికారులు అరెస్ట్ చేసారు. దేశ ఐటి రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరం క్రమంగా నేరాల రాజధానిగా మారిపోతోందని ఇటువంటి సంఘటనలు తెలియజేస్తున్నాయి.

ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం నేర నియంత్రణకి కటినంగా వ్యవహరించవలసి ఉంది కానీ ఈ సంఘటనలో తమ పార్టీకి, ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట చుట్టుకోవడంతో దాని నుండి తప్పించుకొనేందుకు పోలీస్ అధికారులపై వేటు వేసి వారిని బలిపశువులు చేస్తోంది.

టాంజానియా విద్యార్ధినికి జరిగిన అవమానం గురించి మీడియా వెలువరించిన కధనాలు తప్పని, అటువంటిదేమీ జరుగలేదని హోం మంత్రి వాదిస్తున్నపుడు సుమారు డజను మంది పోలీసులను, పోలీస్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేస్తున్నట్లు? తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేస్తామని చెప్పకుండా ఆ తప్పును కప్పి పుచ్చుకోవాలని హోంమంత్రి ప్రయత్నిస్తున్నపుడు ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఉపేక్షిస్తోంది? అనే సందేహాలకు వారే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close