నెల జీతానికి పనిచేస్తున్న రాజ్ తరుణ్

‘హిట్’ పై నడిచే ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ప్రతీ శుక్రవారానికి జాతకాలు మారిపోతుంటాయి. బండ్లు ఓడ‌ల‌వ్వడం, ఓడ‌లు బండ్లగా మార‌డం వెరీ కామన్. వరుసగా ఓ రెండు ఫ్లాపులు పడితే చాలు.. మళ్లీ లైన్ లో కనిపించడం కష్టమే. ఇప్పుడు రాజ్ తరుణ్ పరిస్థితి కూడా ఇలానే వుంది. వరుసగా మూడు హిట్లతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. అతడి మాట, నటన ప్రేక్షకులకు నచ్చాయి. అయితే తర్వాత ఫ్లాపుల పరంపర మొదలైయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైయిందంటే.. రాజ్ తరుణ్ కి రెమ్యునిరేషన్ లేదు. కేవలం నెల జీతానికి పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకి రెమ్యునిరేషన్ లేదు. దిల్ రాజు బేనర్ వాల్యూ బట్టి కేవలం నెల జీతానికి పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. సినిమా విడుదలై లాభాలు వస్తే కనుక అప్పుడు రెమ్యునిరేషన్ గా కొంత ఇస్తానని దిల్ రాజు ముందే క్లియర్ గా చెప్పేశారట. సినిమా పరిశ్రమలో హిట్ చాలా మేటర్ చేస్తుందని చెప్పడానికి రాజ్ తరుణ్ తాజా ఉదాహరణ. అయితే ఈ పరిస్థితి మారడానికి పెద్ద టైం పట్టదు. ఒక్క హిట్ పడితే గనుక మళ్ళీ రాజ్ తరుణ్ కి పునర్వైభవం రాకమానదు. మరా హిట్ ‘ఇద్దరి లోకం ఒక్కటే’తోనే రావాలనే కోరుకుందాం. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close