చైతన్య : నిజంగా జర్నలిజాన్ని అమ్ముకుంది అమర్, రామచంద్రమూర్తిలే..!

ఈ దేశం చాలా మంది జర్నలిస్టుల్ని చూసింది. వారిలో మీడియా హక్కుల కోసం పోరాడిన ఎంతో మందిని చూసింది. ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడని వారిని చూసింది. రాజీ పడిపోయిన వారినీ చూసింది. కానీ.. రాజీపడిపోయిన వారు.. జర్నలిస్టుల హక్కుల్ని కాలరాస్తూంటే… సంతోషంగా… ఎగేసుకుని వెళ్లి .. మద్దతు తెలిపిన వాళ్లు మాత్రం లేరు. వ్యక్తిగత అవసరాలు.. ఇతర ఇబ్బందులు కారణంగా.. వ్యతిరేకత వ్యక్తం చేయలేకపోయి ఉంటే.. కనీసం మాట్లాడకుండా ఉండి ఉండేవారు. కానీ.. కానీ.. దేవుపల్లి అమర్, రామచంద్రమూర్తి … అనే తెలుగు మీడియాలో పేరెన్నికగ గన్న పెద్ద మనుషులు మాత్రం..ఈ కేటగిరీ కాదు. తాము ఏ వ్యవస్థ మీద అయితే ఎదిగామో.. ఆ వ్యవస్థను అడ్డంగా నరికేసే ప్రయత్నం చేస్తూంటే… కత్తులు సానబెట్టి ఇస్తున్నారు. నరికేసేవాళ్లకు ఇంకా ధైర్యం చెబుతున్నారు.

హవ్వ.. దేవులపల్లి అమర్ ..జర్నలిస్ట్ సంఘాల నేతా..?

అసత్యాలు, నిరాధార వార్తలు రాసేవారే జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోకు భయపడతారు.. రాసిన వార్తలు నిజమైతే కోర్టు ద్వారా రక్షణ పొందవచ్చు కదా ..!? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది వైసీపీ నేత కాదు. కరుడు గట్టిన మీడియా వ్యతిరేకత ఉన్న వ్యక్తీ కాదు. జర్నలిస్టుగా పని చేస్తూ… జర్నలిస్టుల సంక్షేమం కోసం..అంటూ.. సంఘాల్లో పదవి పొంది.. పలుకుబడి సాధించి.. మీడియా స్వేచ్ఛ కోసం.. ప్రాణాలు పణంగా పెడతానని.. ప్రకటించిన.. దేవులపల్లి అమర్. రాజకీయ నేతలే.. క్షణాల్లో అభిప్రాయాలు మార్చుకుంటారని.. చాలా మందికి తెలుసు కానీ.. ఇలా జర్నలిస్టులు కూడా.. నమ్మి నడిచిన సిద్ధాంతాలనే.. స్వార్థ ప్రయోజనాల కోసం పణంగా పెడతారని ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా.. తాను ఎదిగిన వ్యవస్థనే కించ పరిచే వ్యాఖ్యలు చేస్తారని.. అసలు అనుకోరు. కానీ.. దేవులపల్లి అమర్ .. దీనికీ తెగించారు. ఏపీ సర్కార్ సలహాదారు పదవితో ఇస్తున్న .. ఏడాదికి రూ. కోటికి.. తన వ్యక్తిత్వాన్ని… ఏళ్ల తరబడి ముసుగేసుకుని.. తెచ్చుకున్న ఓ రకమైన పేరును.. తాకట్టుపెట్టేశారు.

ఎడిటర్‌గా చేసి మీడియా స్వేచ్చపై “మూర్తి” చెప్పే కబర్లివేనా..?

రామచంద్రమూర్తి అంటే.. మీడియా సర్కిల్స్‌లో గౌరవించని వారు ఉండరు. ఆయన ఎన్నో పత్రికలకు ఎడిటర్ గా చేశారు. చాలా మంది జర్నలిస్టులకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు. ఆయన ఎక్కడ పని చేసినా.. ఆయన భావాలతో వ్యతిరేకించే వారయినా.. సరే ఆయనను గౌరవిస్తారు. జర్నలిజంతో… అంతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని..మీడియా స్వేచ్చ అంటే.. ఎంటో ఎడిటర్‌గా… చూపించిన రామచంద్రమూర్తి కూడా.. ఏపీ సర్కార్ తీసుకు వచ్చిన జీవోను సమర్థించడం.. అశ్చర్యకరమే. ఆయన సాక్షిలో ఎడిటోరియల్ డైరక్టర్ గా చేరినప్పుడు… ఆయన రాసిన కథనాలను ఎవరూ తప్పు పట్టలేదు. అవి అంతకు ముందు ఆయన అభిప్రాయాల కన్నా.. భిన్నంగా ఉండేవి. జర్నలిజం అంతే కదా అనుకుని సమాధానపడవచ్చు. కానీ.. మీడియాపైనే కత్తి పెట్టే… జీవోను సమర్థించాల్సిన అవసరం ఏమి వచ్చింది. ప్రభుత్వం.. సలహాదారు పదవితో.. ప్రజాధనాన్ని రూ. కోటి తనకు ఇస్తున్నందున… అలా మాట్లాడాల్సి వచ్చింది. రూ. కోటి కోసమే.. తాను ఎదిగిన వ్యవస్థను నరికేస్తూంటే సమర్థిస్తారా..? కనీసం సైలెంట్ గా ఉన్నా…. తాను కూర్చున్న కొమ్మకైనా కాస్తంత గౌరవం ఇచ్చినట్లు ఉండేది కాదా..?

ఇలాంటి వారితో ఇక జర్నలిజం మనుగడ సాగించగలదా..?

ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో… మీడియా అస్థిత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఏమి రాయాలన్నా.. ఎదుట కత్తిపట్టుకున్న ఫ్యాక్షనిస్టు కనిపించేలా చేస్తోంది.ఈ విషయం జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైపోయింది. అందుకే.. ప్రెస్ కౌన్సిల్ సహా.. .ప్రతి ఒక్కరూ ఖండించారు. జర్నలిజాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఖండించారు. కానీ.. జర్నలిజం పేరుతో ఎదిగి.. నీతి వాక్యాలు వల్లించి.. తాము అంతులేని స్వేచ్చను అనుభవించి.. ఇప్పుడు.. దానిపైనే.. దాడులకు తెగబడుతూంటే.. ఆ తెగబడుతున్న వారి వద్దే.. ప్రజాధనాన్ని రూ. కోట్లు జీతాలుగా తీసుకుంటూ… ఆ దుశ్చర్యలకు మద్దతు పలుకులు పలుకుతున్నారు ఘనత వహించిన పెద్దలు. నిజంగా… జర్నలిజాన్ని నమ్ముకున్నోడు..ఆస్తులు, అంతస్తులతో ఎదగలేకపోవచ్చు కానీ.. వ్యక్తిత్వపరంగా ఎదుగుతారు. కానీ జర్నలిజాన్ని అమ్ముకుంటున్న వారు మాత్రం.. వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకుని.. వ్యక్తిగతంగా ఎదుగుతారు. ఇన్నాళ్లకు.. వాళ్లలో దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి ప్రముఖులని బయటపడింది. ఇలాంటి వారుంటే.. జర్నలిజం.. మనుగడ సాగించడం కష్టమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close