భాజ‌పాలో చేరితే మోత్కుప‌ల్లి క‌ల నెర‌వేరుతుందా..?

సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు భాజ‌పాలో చేరేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. సోమ‌వారం నాడు ఆయ‌న ఢిల్లీకి వెళ్తున్నారనీ, భాజ‌పా కండుకువా క‌ప్పుకుంటార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఆయ‌న టీడీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. నిజానికి, ఆయ‌న టీడీపీలో ఉండ‌గా ఫైర్ బ్రాండ్ అన్న‌ట్టుగా ఉండేవారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగేవారు. అయితే, ఉన్న‌ట్టుండి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మీద విమ‌ర్శ‌లు ప్రారంభించారు. అదే స‌మ‌యంలో వైకాపా నుంచి కూడా ఆయ‌న‌కి కొంత మ‌ద్ద‌తు ల‌భించింద‌న్న‌ది వాస్త‌వం! ఆ స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి ఆయ‌న ఇంటికి వెళ్లారు క‌దా. చంద్ర‌బాబును ఓడిస్తా, ఆంధ్రా వ‌చ్చి స‌భ‌లు పెడ‌తా ప్ర‌చారం చేస్తా అంటూ చాలా మాట్లాడారు.

టీడీపీ బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యాక అధికార పార్టీ తెరాస‌లో ఆయ‌న చేరే ప్ర‌య‌త్నాలు చేశార‌నే క‌థ‌నాలూ వ‌చ్చాయి. అయితే, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌నీ, దాంతో ఆ ప్ర‌య‌త్నాలు విర‌మించుకున్నార‌నీ అంటారు! ఇప్పుడు భాజ‌పా ఆయ‌న్ని ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ స్వ‌యంగా మోత్కుప‌ల్లిని క‌లిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయ‌న ఢిల్లీకి వెళ్లి, కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు. మోత్కుప‌ల్లిని చేర్చుకోవ‌డం వ‌ల్ల భాజ‌పాకి లాభ‌మేంటంటే… ఒక గ‌ట్టి వాయిస్ పార్టీకి తోడైన‌ట్టు అవుతుంది. కేసీఆర్ ని మాంచి వాగ్దాటితో కడిగేయగ‌‌ల‌రు.

భాజ‌పాలో చేర‌డం వ‌ల్ల మోత్కుప‌ల్లికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉన్న‌ట్టు అవుతుంది. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో తామే ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాం అంటోంది. దాంతో రాష్ట్రంలో ప్ర‌ముఖ భాజ‌పా నేత‌గా గుర్తింపు పొందే అవ‌కాశం ఉంటుంది. ఇదంతా ఓకేగానీ… మోత్కుప‌ల్లి చిర‌కాల‌ రాజ‌కీయ క‌ల భాజ‌పాలో చేర‌డం వ‌ల్ల నెర‌వేరుతుందా అనేదే అస‌లు ప్ర‌శ్న‌? ఆయ‌న‌కి టీడీపీ మీద కోపం వ‌చ్చిందే గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌న పేరును చంద్ర‌బాబు సిఫార్సు చెయ్య‌నందుకు, ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే క‌నీసం రాజ్య‌స‌భ‌కైనా త‌న‌ని పంపించ‌నందుకు క‌దా! ప‌ద‌వి లేద‌న్న‌దే ఆయ‌న ఆవేద‌న. మ‌రి, భాజ‌పాలో చేరాక త‌న క‌ల‌ల్ని సాకారం చేసుకుంటారా, ఆ పార్టీ నుంచి ప‌దవుల‌కు సంబంధించి ఏదైనా స్ప‌ష్ట‌మైన భ‌రోసా ల‌భించిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక‌టైతే వాస్త‌వం… టీడీపీ నుంచి బ‌హిష్క‌ణ‌కు గుర‌య్యాక‌, తెరాస‌లో చేర‌లేరు. కాంగ్రెస్ లోకి వెళ్ల‌లేరు. రాజ‌కీయ భ‌విష్య‌త్తు కావాలనుకుంటే ప్ర‌స్తుతం మాత్ర‌మే భాజ‌పా క‌నిపిస్తోంది. కాబ‌ట్టి, బేరాలాడే ప‌రిస్థితి ఉంటుందా అనేది ప్ర‌శ్న‌..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close