విశాల్ సినిమాకి రూ.60 కోట్లా?

విశాల్‌కి మంచి మార్కెట్ ఉంది. తెలుగు, త‌మిళం.. రెండు చోట్లా – త‌న సినిమాకి టికెట్లు తెగుతాయి. అభిమ‌న్యుడుతో మంచి హిట్టు కూడా ద‌క్కించుకున్నాడు. అయితే…త‌న‌ది రూ.50 కోట్ల రేంజ్ మాత్రం కాదు. అలాంటిది.. త‌న కొత్త సినిమా `యాక్ష‌న్‌`కి ఏకంగా రూ.60 కోట్లు ఖ‌ర్చు పెట్టాడు. ఈ విష‌యాన్ని విశాల్ స్వ‌యంగా చెప్పాడు. ఇది పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమా అనీ, అందుకే 60 కోట్లు పెట్టాల్సివ‌చ్చింద‌ని, అయితే తెర‌పై 150 కోట్ల సినిమాలా క‌నిపిస్తుంద‌ని చెబుతున్నాడు విశాల్‌.

విశాల్ సినిమా ఎంత పెద్ద హిట్ట‌యినా తెలుగులో 5 – 6 కోట్ల రేంజ్ దాట‌దు. త‌మిళంలో మ‌హా అయితే 20 కోట్లు చేస్తుందేమో. శాటిలైట్‌, డిజిట‌ల్ క‌లిపి మ‌రో 10 కోట్లు అనుకున్నా, 60 కోట్ల మైలు రాయికి ద‌రిదాపుల్లో కూడా వెళ్ల‌దు. అంటే… విశాల్ త‌న జీవితంలోనే అత్యంత పెద్ద రిస్క్ తీసుకున్నాడ‌న్న‌మాట‌. ఏమో..? ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు.. విశాల్ త‌న పాత రికార్డుల‌న్నీ ఈ సినిమాతో బ‌ద్ద‌లు కొడ‌తాడేమో..? పైగా ఈమ‌ధ్య తెలుగులో డ‌బ్బింగ్ సినిమాలు బాగానే ఆడాయి. ఖైదీ, విజిల్ – దీపావ‌ళికి హ‌డావుడి చేశాయి. విశాల్‌ని కూడా త‌మిళ హీరో అనుకోరెవ్వ‌రు. త‌మ‌న్నా గ్లామ‌ర్ మ‌రో ప్ల‌స్ పాయింట్‌. విశాల్‌ని గ‌ట్టెక్కించాల్సిన‌వి ఇవే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close