ఏబీఎన్, టీవీ5పై మళ్లీ బలవంతపు బ్యాన్..!?

ఏబీఎన్, టీవీ 5 ప్రసారాలను.. చూసి.. ఏపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. తమకు వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజాగళాన్ని… వినిపిస్తున్న చానళ్ల గొంతు నొక్కేయాలని.. రౌడీయిజాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. గతంలో.. ఎంఎస్‌వోలను బెదిరించి చానళ్లను నిలిపివేయించిన విధంగానే మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీశాట్, ట్రాయ్ ఆదేశాలతో.. చానల్ పునరుద్ధరణ జరిగిన కొన్ని రోజులకే.. మంత్రుల అసహనం.. పెరిగిపోతోంది. తాజాగా.. మరోసారి పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నానిలు ఎంఎస్‌వోలను పిలిపించి సమావేశం పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. టీవీ5, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలు రాకూడదని ఆదేశించారు. లేకపోతే.. తీవ్ర పరిణామాలుంటాయని.. మీ కేబుళ్లన్నీ.. కరెంట్ స్తంభాలపైనే ఉంటాయని.. హెచ్చరికగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అయితే.. నిబంధనల ప్రకారం.. ఇరవై ఒక్క రోజుల ముందు నోటీసు ఇచ్చి.. ప్యాకేజీ -2 కింద మార్చాల్సి ఉంటుందని.. ఆ నోటీసులు ఇస్తామని.. ఎంఎస్‌వోలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి నోటీసులు అయినా సరే ఇచ్చుకోండి… చానళ్ల ప్రసారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆగిపోవాలని.. మంత్రుల ఏకవాక్య ఆదేశమంటున్నారు. ఏపీ ఫైబర్ నెట్ వల్ల.. తమ ఉపాధికి గండి పడే పరిస్థితి ఉందని… ఎంఎస్‌వోలు.. తమ డిమాండ్‌ను వినిపించడంతో.. ఇక ఫైబర్ నెట్‌ను కూడా… నిర్వీర్యం చేస్తామని… హామీ ఇచ్చినట్లుగా.. ఎంఎస్‌వో వర్గాలు చెబుతున్నాయి. సమావేశానికి రాలేకపోయిన ఎంఎస్‌వోలకు…సమావేశం వివరాలు చెప్పి.. రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయనే… హెచ్చరికలను కన్వే చేయాలని మంత్రులు చెప్పినట్లు గా తెలుస్తోంది.

మొత్తానికి అనుకూలంగా లేని.. ప్రతిపక్ష వాయిస్‌ను వినిపిస్తున్న మీడియా గొంతును.. ఎట్టి పరిస్థితుల్లోనూ నొక్కేయాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉంది. ఇప్పటికే.. జీవోలు జారీ చేసి.. పత్రికా స్వేచ్చపై కత్తి పెట్టిన… ప్రభుత్వం.. ఇప్పుడు అనైతిక పద్దతుల్లో.. తమకు అనుకూలంగా లేని చానళ్లను.. నిలిపివేసేవరకూ.. ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close