“కియా”ను ప్రారంభించబోతున్న జగన్..!

నిజమే…! కియా పరిశ్రమను జగన్ ప్రారంభించబోతున్నారు..! అదేంటి… ఆ పరిశ్రమ ఎప్పుడో ప్రారంభమైంది కదా.. కియా కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి కదా.. అనే డౌట్ వస్తే… దాన్ని డౌట్‌లాగే ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ లెక్క ప్రకారం.. కియా ప్లాంట్‌ను..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించక ముందు..సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీకి తీసుకు వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత  ఆ పరిశ్రమ వెనక్కి తగ్గింది. తర్వాత వైఎస్ కుమారుడు.. సీఎం అయ్యే చాన్స్ ఉందన్న ఉద్దేశంతో… మళ్లీ పరిశ్రమ ఏపీకి వచ్చింది. ఆయన కుమారుడు సీఎం అయి.. ఆరు నెలల్లోగా ఉత్పత్తి ప్రారంభించేలా.. కంపెనీని సిద్ధం చేశారు. ఇప్పుడు ప్లాంట్ సిద్ధమయింది. దాన్ని వైఎస్ కుమారుడు జగన్ సీఎం హోదాలో ప్రారంభించబోతున్నారు. ఈ ముహుర్తాన్ని గురువారం ఖరారు చేసుకున్నారు. గురువారం అనంతపురం కియా ప్లాంట్‌ను.. జగన్ ప్రారంభించి.. కార్లను విడుదల చేస్తారు.
 
కియా పరిశ్రమ చుట్టూ.. వైసీపీ చేసిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. కియా పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వివిధ అంశాలపై ఒత్తిడి తెచ్చిందని ప్రచారం జరిగింది. ఈ కారణంతో.. విడిభాగాల పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే తగ్గట్లుగానే… గతంలో..ఏపీ సర్కార్‌కు ప్రతిపాదనలు సమర్పించిన కంపెనీలేవీ.. అనంతపురంలో పనులు ప్రారంభించలేదు. గతంలో కారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో… హిందుపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్… కియా యాజమాన్యంతో దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఆ తర్వాత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కియా యాజమాన్యం నుంచి.. “హైలీ రెస్పెక్టెడ్ సర్‌నేమ్‌” అని సంబోధించుకుంటూ ఓ లేఖ తీసుకొచ్చి.. అసెంబ్లీలో వినిపించారు. అది సోషల్ మీడియాలో… కామెడీకి కేరాఫ్ అయిపోయింది.

ఆరు నెలల్లో ఒక్క పరిశ్రమను కూడా… జగన్మోహన్ రెడ్డి ఏపీకి తీసుకురాలేకపోయారు. కొన్ని పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది కానీ..  ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ.. చంద్రబాబు హయాంలో.. ఏపీలో పెట్టుబడులు వచ్చిన దిగ్గజ కంపెనీలన్నీ వెనక్కి పోయాయి. ఈ విషయంపై.. ప్రభుత్వం.. ఎదురుదాడికి దిగుతోంది. తమ విధానాలు నచ్చితేనే వస్తారని లేకపోతే.. అవసరం లేదని వాదిస్తోంది. దీంతో..  ప్రారంభమైన ప్లాంట్లనే.. జగన్ మరోసారి ప్రారంభించాల్సి వస్తోంది.
 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close