వెంకీమామ క‌థ‌కు కోటి రూపాయ‌లా?

వెంకీ మామ శుక్ర‌వారం విడుద‌లైంది. ఇద్ద‌రు స్టార్ హీరోలున్నా – బ‌ల‌మైన క‌థ లేద‌ని విమ‌ర్శ‌కులు విశ్లేషించేశారు. జాత‌కాలు అనే రొటీన్ పాయింట్‌ని ప‌ట్టుకుని, ఇంకాస్త రొటీన్ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాని న‌డిపించేశారు. అయితే ఈ మాత్రం క‌థ వండ‌డానికి చిత్ర‌బృందం చాలా క‌ష్ట‌ప‌డింది. చాలా ఖ‌ర్చు పెట్టింది. ఈ క‌థ త‌యార‌వ్వ‌డానికి కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది.

జ‌నార్థ‌న మ‌హ‌ర్షి తీసుకొచ్చిన క‌థ ఇది. ఆయ‌న క‌థ ఇచ్చినందుకు 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ స‌మ‌ర్పించుకున్నారు. ఆ త‌ర‌వాత కోన వెంక‌ట్ చేతిలో ప‌డింది. బాబి, కోన వెంక‌ట్‌, మ‌రో ఇద్ద‌రు ర‌చ‌యిత‌లు క‌లిసి ఈ క‌థ‌ని సాన‌బెట్టారు. జ‌నార్థ‌న మ‌హ‌ర్షి ఈ క‌థ తెచ్చేట‌ప్పుడు అందులో మిల‌ట‌రీ ఎపిసోడ్ లేదు. కోన దాన్ని జోడించాడు. రావు ర‌మేష్ ట్రాకు మ‌రో కొత్త ర‌చ‌యిత రాసుకొచ్చాడు. ఇలా క‌థ‌లో మార్పులు చేర్పులూ చేసినందుకు కోన‌కు అక్ష‌రాలా 50 ల‌క్ష‌లు ఇచ్చార‌ని టాక్‌. మిగిలిన ర‌చ‌యిత‌ల‌కు త‌లో ప‌ది పంచినా ఈ క‌థ‌కు కోటి రూపాయ‌లు అయిపోయింది. అయితే ఎక్కువ మార్పులూ, చేర్పులూ సురేష్ బాబు సూచించిన‌వే. అలా.. ప‌ది మంది క‌లిసి వండిన క‌థ ఇది. ఇంత మంది వండారు కాబట్టే క‌ల‌గాపుల‌గం అయిపోయిందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close