కార్మిక సంఘాల ఎన్నిక‌ల ఆల‌స్యం వెన‌క వ్యూహ‌మేంటి..?

సంఘాలు ఉండొద్దు… ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏకైక ల‌క్ష్యం ఇదే అన్న‌ట్టుగా ఉంది. నిజానికి, ఉద్య‌మ స‌మ‌యంలో ఏ సంఘాలైతే కేసీఆర్ వెంట మ‌ద్ద‌తుగా న‌డిచాయో, ఇప్పుడు ఆ సంఘాలను స‌మూలంగా లేకుండా చెయ్యాల‌నే వ్యూహంతో ముఖ్య‌మంత్రి అడుగులు వేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాయి. తాజాగా సింగ‌రేణి కార్మిక సంఘాల‌కు సంబంధించిన ఓ చ‌ర్చ అధికార పార్టీ వ‌ర్గాల్లో మొద‌లైంది. సింగ‌రేణి కార్మిక సంఘాలు తెలంగాణ‌లో చాలా కీల‌క‌మైన‌వి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయా సంఘాలకు వ‌రాలు ప్ర‌క‌టించి, వాటిని కాపాడుకునే బాధ్య‌త త‌మ‌ది అన్న‌ట్టుగా తెరాస వ్య‌వ‌హ‌రించింది. కానీ, ఇప్పుడు అవే సంఘాల ఉనికిని నిర్వీర్యం చేయాల‌నే వ్యూహంతో ప్ర‌భుత్వం ఉందా అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

త్వ‌ర‌లో సింగ‌రేణి కార్మిక సంఘాల‌ ఎన్నిక‌లు జ‌ర‌పాల్సి ఉంది. అయితే, ఇవి అనుకున్న స‌మ‌యానికి జ‌రుగుతాయా అంటే కొంత అనుమాన‌మే వ్య‌క్త‌మౌతోంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను ఆల‌స్యం చేసేందుకు కేసీఆర్ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సంఘాల అంశంలో అనుస‌రించిన ప‌ద్ధ‌తినే ఇక్క‌డా ప్ర‌యోగించాల‌ని భావిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆర్టీసీ సంఘాలు స‌మ్మెకి దిగితే… ఆయా సంఘాల నుంచి కార్మికుల‌ను అత్యంత చాక‌చ‌క్యంగా వేరు చేయ‌డంలో కేసీఆర్ స‌ర్కారు విజ‌యం సాధించింది. కార్మికుల హ‌క్కుల కోసం పోరాడే సంఘాలే… కార్మికుల‌కు న‌ష్టం చేశాయ‌నే అభిప్రాయాన్ని క‌లిగించారు. అంతేకాదు, స‌మ్మె ముగిశాక‌, ఆర్టీసీ కార్మికులు కొంత‌మంది కార్మిక శాఖ‌కు లేఖ రాశారు. గుర్తింపు సంఘాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించొద్దు, మాకు ఇలానే బాగుంద‌ని లేఖ‌లు రాస్తుంటే… ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తామ‌ని అధికారులు అంటున్నారు! దీంతోపాటు, మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ సంఘాల ఊసే ఎత్తొద్దు అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టంగా ఆదేశించారు క‌దా.

సింగ‌రేణి గుర్తింపు సంఘాల ఎన్నిక‌ల ఆల‌స్యం చేయ‌డం వెన‌క కూడా ఇలాంటి వ్యూహాన్నే తెర మీదికి తెస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతిమంగా రాష్ట్రంలో ఏ సంఘాలూ ఉండొద్దు అనేది ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టుంది. సంఘాల కంటే ప్ర‌భుత్వ‌మే కార్మికులు, ఉద్యోగుల‌కు అండ‌గా ఉంటుంద‌నే అభిప్రాయం క‌లిగించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే, ఉప్యాధ్యాయ‌ సంఘాలు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల మీద సీఎం గుస్సా అవుతున్నారు. అంతేకాదు, ప్ర‌జా సంఘాల నుంచి ఎవ‌రైనా నాయ‌కులు సీఎంవోకి వెళ్లి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వొద్ద‌నే మౌఖిక ఆదేశాలు కూడా అమ‌ల్లో ఉన్నాయ‌ట‌! ఎన్నిక‌లు ఆల‌స్యం చేస్తే నాయ‌కులుండ‌రు, నాయ‌కులు లేక‌పోతే సంఘాల మ‌నుగ‌డ ఉండ‌దు… ఇదే వ్యూహంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close