ఐపీఎల్ వేలం : ఫాస్ట్‌బౌలర్‌ కమ్మిన్స్‌కు పదిహేనున్నర కోట్లు..!

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ నక్కతోకను తొక్కాడు. వచ్చే ఐపీఎల్‌లో ఏకంగా రూ. పదిహేను కోట్ల యాభై లక్షలకు అమ్ముడుపోయాడు. వేలంలో కమ్మిన్స్ జరిగిన పోటీలో.. కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. సాధారణంగా… టీ ట్వీంటీల్లో బ్యాట్స్‌మెన్లకే ఫ్రాంచైజీలు ప్రాధాన్యం ఇస్తాయి. కానీ కేకేఆర్ ఈ సారి బౌలర్ కోసం.. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కమ్మిన్స్.. టీ ట్వీంటీల్లో… సంచలనాలేమీ సృష్టించలేదు.. కానీ.. ఫలితాలను తారుమారు చేయగలశక్తి ఉన్న ఆటగాడిగా గుర్తిస్తారు.

మరో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. పది కోట్ల 75 లక్షలు వెచ్చించింది. కేకేఆర్ టీంకు షారుఖ్… పంజాబ్ టీంకు ప్రీతి జింటా కో ఓవర్స్. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌మోరిస్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.10 కోట్లకు , ఇంగ్లాండ్‌ పేసర్‌ సామ్‌ కరన్‌ను 5.50 కోట్లకు చెన్నై టీం వేలంలో పాడుకుంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను కోల్‌కతా రూ.5.25 కోట్లకు చేజిక్కించుకుంది. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ను ఆర్‌సీబీ రూ.4.40 కోట్లకు తీసుకుంది.

భారత ఆటగాళ్లలో రాబిన్‌ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో యువరాజ్ సింగ్‌కు అత్యధిక ధర పలికింది. దాదాపుగా పదిహేడు కోట్ల వరకూ యువరాజ్ ఒక్క సీజన్ కు సొంతం చేసుకున్నాడు. అయితే.. ఓ విదేశీ ఆటగాడికి మాత్రం.. ఇంత వరకూ అంత పెద్ద మొత్తం అవకాశం రాలేదు. ఆ చాన్స్‌ను పాట్ కమ్మిన్స్ మొదటి సారి పొందాడు. పలువురు భారత ఆటగాళ్లపై ఈ సారి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close