చైతన్య : హైదరాబాద్ అభివృద్ధి వల్ల బాగుపడింది తెలుగు ప్రజలు కాదా..?

చంద్రబాబు హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ది చేశాడని.. అందుకే విభజన వాదం వచ్చిందని.. ఇప్పుడు అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలనుకున్నారని… అందుకే.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని.. కొంత మంది రాజకీయ నేతలు భిన్నమైన.. చిత్రమైన వాదన వినిపిస్తున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల.. అక్కడి ప్రజలు మాత్రమే బాగుపడ్డారా..? అక్కడి ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వాళ్లు కాదా..? హైదరాబాద్ వల్ల ఉమ్మడి రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరగలేదా..? అసలు అభివృద్ధి అంటే.. ఏమిటని ఈ రాజకీయ నేతలు అనుకుంటున్నారు..?

హైదరాబాద్ అభివృద్దితో మెరుగుపడిన ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు..!

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందు వరకూ… తెలుగురాష్ట్రాల్లో అభివృద్ధి అనే మాట వినిపించేది కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి రుచి చూపించారు. అభివృద్ధి చేస్తే బతుకులు ఎలా బాగుపడతాయో చూపించారు. 1990ల వరకూ… హైదరాబాద్ అభివృద్ధిని కళ్లారా చూసే వరకూ … అభివృద్ధి అనే పదం రాజకీయాల్లో వినిపించేది కాదు. అక్కడ జరిగిన కళ్లు చెదిరే అభివృద్ధిని చూసిన రాజకీయ నేతలు.. దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ప్రారంభించారు. చంద్రబాబు అభివృద్ధి అంతా.. హైదరాబాద్‌లో చేశారనే వాదన ప్రారంభించి.. ఇతర ప్రాంతాల వాసులను రెచ్చగొట్టడం ప్రారంభించారు. చంద్రబాబు హైదరాబాద్‌కు ఐటీని తీసుకు రావడం వల్లే .. ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం మంది కుటుంబాలు ఐటీ రంగంలో ఉపాధి పొంది.. డబ్బులు సంపాదించుకుని.. అభివృద్ధి ఫలాలు రుచి చూస్తున్నాయి. అంటే.. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి వల్ల హైదరాబాద్ మాత్రమే కాదు.. ఊళ్లలోని కుటుంబాలు కూడా బాగుపడ్డాయి. కానీ ఆ ఐటీ అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో జరిగిందని… ఐటీ ఉద్యోగాలు పొందిన కుటుంబాల్లోని వారే ఆలోచించే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో ఐటీ ఉండబట్టే… తమ కుటుంబాలు అభివృద్ధి చెందాయని వారు ఆలోచించలేకపోతున్నారు. రాజకీయ నేతలు వారి ఆలోచనల్ని మరింత కుత్సితం చేస్తున్నారు.

అమరావతిలో అభివృద్ధి జరిగినా రాష్ట్రమంతటికి ఆ ఫలాలు..!

అమరావతిని హైదరాబాద్‌ రేంజ్‌లో అభివృద్ధి చేస్తే.. అక్కడ భూములిచ్చిన రైతులు కొంత వరకే బాగుపడతారు. వారు భూముల్ని అమ్ముకున్నంత వరకే.. వారి అభివృద్ధి. అది కమ్మ వాళ్లయినా.. రెడ్లయినా… ఇంకా ఎవరైనా కావొచ్చు. కానీ చంద్రబాబు ప్రజారాజధానిగా మార్చాలనుకున్న అమరావతికి తీసుకొచ్చే కంపెనీలు.. పరిశ్రమలు.. వల్ల కలిగే ఉపాధి.. ఏపీ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. అది శాశ్వతం. అక్కడ లభించే ఉపాధి శాశ్వతం. కారణం ఏదైనా… చంద్రబాబు హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారన్న ప్రచారం జరగడం.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి విషయంలో ఆయన వేసుకున్న ప్రణాళికలు… మరోసారి హైదరాబాద్‌లానే అమరావతిని అభివృద్ధి చేయబోతున్నారన్న ప్రచారాన్ని చేయడానికి రాజకీయ నేతలకు మంచి అస్త్రంగా మారింది. హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిన తర్వాత ఒక్కచోటే .. డెవలప్ చేశారని విమర్శలు ప్రారంభించిన రాజకీయం.. అమరావతి విషయంలో మాత్రం.. ఇంకా పునాదులు పడక ముందే పురివిప్పుకుంది. మాకేంటి.. అనే భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించారు. అమరావతి అభివృద్ధి చెందితే.. వచ్చే లాభం.. ప్రజలకే అని గుర్తించలేకపోతున్నారు. అలా గుర్తించకుండా.. రాజకీయ నేతలు కుల, మత విద్వేషాలు కమ్మేలా చేస్తున్నారు.

వినాశనానికే రాజకీయాలు..!

అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను మూడు ప్రాంతాలకు పంచి గొప్ప అభివృద్ధిని చూపిస్తున్నామని చెప్పబోతున్నారు. ఒక్క సెక్రటేరియట్ పెడితే.. ఒక్క కొత్త ఉద్యోగం ఉత్తరాంధ్రకు రాదు. కానీ.. ఓ పరిశ్రమ పెడితే.. కొన్ని వేల ఉద్యోగాలొస్తాయి. అదీ అభివృద్ధి. అలాంటి అభివృద్ధిని కాదనుకుంటున్న జనం… మరేదో కోరుకుంటున్నారు. అసలు అభివృద్ధి అనే దాన్ని చేయకుండా.. అందరి రాజకీయ నాయకుల్లా… చంద్రబాబు రాజకీయమే చేసి ఉంటే… అసలు ఈ సమస్య ఉండేది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close