మ‌త్తు వ‌ద‌ల‌రా… చాలా క‌ట్ చేసేశారు

ఈవారం విడుద‌లైన సినిమాల్లో `మ‌త్తు వ‌ద‌ల‌రా` ఒక‌టి. మైత్రీ మూవీస్, క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా రూపొందించిన చిత్ర‌మిది. మౌత్ టాక్ బాగానే వ‌చ్చింది. విమ‌ర్శ‌కులూ… మెచ్చుకున్నారు. అయితే వ‌సూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సెకండాఫ్‌లో, అందునా క్లైమాక్స్‌లో కాస్త లాగ్ క‌నిపించింది. నిజానికి ఈ సినిమాలో క‌ట్ చేసిన భాగం ఇంకా చాలానే ఉంది. క్లైమాక్స్‌లో సీజీ వ‌ర్క్ కేవ‌లం 4 నిమిషాలే తెరపై క‌నిపించింది. నిజానికి ఇంకో 16 నిమిషాల ఫుటేజ్ ఉంద‌ట‌. అంతేకాదు… ష‌క‌ల‌క శంక‌ర్ తో ఓ ట్రాక్‌ని డిజైన్ చేశారు. ఆ ట్రాక్ బాగా పేలింద‌ట‌. అయితే నిడివి ఎక్కువ అయిపోయింద‌నిపించి, దాన్ని చివ‌రి నిమిషంలో తొల‌గించారు. మైత్రీ మూవీస్ నిర్మాత‌లు సినిమా విడుద‌ల‌కు ముందు చివ‌రి నిమిషంలో ఈ మార్పులు చేశారు. లేదంటే ఇంకా లాగ్ అయిపోదును. అయితే అప్పుడు క‌త్తిరించిన స‌న్నివేశాల్ని ఇప్పుడు జోడిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు. అలా యాడ్ చేయాల‌న్నా ఈరోజుల్లో చాలా క‌ష్ట‌మైన ప‌నే. శాటిలైట్‌లో వ‌దిలిన‌ప్పుడు… తొలగించిన స‌న్నివేశాల్నీ చూసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిన్నెల్లి అరెస్టు పేరుతో రోజంతా డ్రామా నడిపిన పోలీసులు !

ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో ధ్రిల్లర్ డ్రామాను నడపడంలో అద్భుతమైన విజయం సాధించారు. మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు. తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. తర్వాత అరెస్ట్ చేశామని...
video

నెత్తురుతో కత్తికి పదును పెట్టే భార‌తీయుడు

https://www.youtube.com/watch?v=lPP7svLGvFM క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ లో వచ్చిన ‘భార‌తీయుడు’ ఓ సంచలనం. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్. రెహమన్ ఇచ్చిన.. అదిరేటి డ్రస్సు , మాయా మచ్ఛీంద్ర ,...

నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం

నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఇకపై పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే....

రేవంత్ సన్మానం చేస్తే కేసీఆర్ వద్దంటారా ?

తెలంగాణ సాధనలో మీది ప్రముఖ పాత్ర... వచ్చేయండి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ చాలా మందిని పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close