జగన్‌కి కోర్టులో షాక్ తప్పదన్న మాజీ సీఎస్..!

ప్రభుత్వాలు నియమించే కమిటీలు.. ప్రభుత్వానికి ఏమి కావాల్సి ఉంటే..అవి రాసిస్తాయి. అలా రాసిచ్చేవారితోనే కమిటీలు ఏర్పాటు చేస్తారు. సహజంగా జరిగేది ఇదే. అలా అని ఆ కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో ఏముంటుందో.. ముందే ఏ ప్రభుత్వ పెద్ద కానీ.. అధికారులు కానీ.. మంత్రులు కానీ చెప్పరు. అలా చెబితే… ఆ కమిటీ విశ్వసనీయత ప్రశ్నార్థమవుతుంది. దాన్ని చూపించి.. నిర్ణయాలు తీసుకుంటే.. కోర్టుల్లో షాక్ తగులుతుంది. ఇదే పరిస్థితి జగన్‌కు ఎదురవుతుందని.. అంటున్నారు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. ఆయన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని నిస్సంకోచంగా ప్రకటించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా… కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశారని.. కోర్టుల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చేశారు.

జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రెండు మూడు రోజుల్లో వస్తుందనగా.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రకటించారు. విచిత్రంగా.. జీఎన్ రావు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా.. అదే తరహా నివేదిక ఇస్తుందని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విశాఖలోనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. అలాగే… బోస్టన్ గ్రూప్ కూడా.. నివేదిక ఇచ్చింది. దాంతో.. అవన్నీ.. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు రాసుకొచ్చిన కమిటీలని.. ప్రజల్లోనూ అభిప్రాయం ఏర్పడిపోయింది.

ఈ రెండు కమిటీల నివేదికలను పరిశీలించి.. ప్రభుత్వం తరపున నియమించిన హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని.. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అసలు ప్రభుత్వం చెబుతున్నదే.. ఈ రెండు కమిటీలు నివేదికల రూపంలో ఇచ్చినప్పుడు.. హైపవర్ కమిటీ మాత్రం మరో రకంగా ఎందుకు అనుకుంటుంది..? ఇవన్నీ.. కోర్టుల్లో ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా.. కమిటీలతో.. కావాల్సిన విధంగా రిపోర్టులు తెప్పించుకుని.. నిబంధనలు ఉల్లంఘించిందనే అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఐవైఆర్ చెప్పిన దాని ప్రకారం.. జగన్ కు షాక్ తప్పదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close