కృష్ణ‌కు దాదాసాహెబ్ ఫాల్కే.. చిరు డిమాండ్‌

తెలుగు చిత్ర‌సీమ‌లో ఎన్నో ప్రయోగాలు, ప్ర‌య‌త్నాలు చేసిన న‌టుడు కృష్ణ‌. ఆయ‌న్ని ప్ర‌భుత్వం త‌గు రీతిలో స‌త్క‌రించ‌లేద‌న్న విమ‌ర్శ ఉంది. దాన్ని చిరంజీవి మ‌రోసారి గుర్తు చేశారు. ద‌క్షిణాదిన అత్యంత సీనియ‌ర్ న‌టుల‌లో కృష్ణ ముందుంటార‌ని, తెలుగు చిత్ర‌సీమ‌కు ఆయ‌న ఎంతో చేశార‌ని, అయితే ఆయ‌న‌కు ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్క‌లేద‌ని అభిప్రాయ ప‌డ్డారు చిరంజీవి. ఆయ‌న‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి, స‌త్క‌రించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంద‌ని, ఈ మేర‌కు రెండు తెలుగు ప్రభుత్వాలూ పూనుకోవాల‌ని పిలుపు నిచ్చారు. కృష్ణ‌కు దాదాసాహెబ్ పాల్కే ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి డిమాండ్ చేశారు. ఆయ‌న‌కు దాదా సాహెబ్ ఫాల్కే ద‌క్కితే, అది ఆయ‌న‌కు కాద‌ని, తెలుగువాళ్లంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చాడు చిరు.

తెలుగు సినిమా విష‌యంలో కృష్ణ చేసిన ప్ర‌యోగాలు అన్నీ ఇన్నీ కావు. తొలి కౌబోయ్ చిత్రం, తొలి ఈస్ట్ మ‌న్ క‌ల‌ర్‌, తొలి క‌ల‌ర్‌, తొలి 70 ఎం.ఎమ్‌.. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ కృష్ణ ముందున్నారు. క‌థానాయ‌కుడిగానే కాదు, నిర్మాత‌గా, స్టూడియో అధినేత‌గా సేవ‌లు అందించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌న్ స‌త్కారాన్ని చాలా ఆల‌స్యంగా ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు దాదా సాహెబ్ ఇవ్వాల‌న్న‌ది చిరు డిమాండ్‌. అది న్యాయంగానే ఉంది. మ‌రి రెండు తెలుగు ప్ర‌భుత్వాలూ కేంద్రానికి సిఫార్సు చేస్తే ఇదేమంత క‌ష్టం కాదు. మ‌రి ఇప్ప‌టికైనా ముంద‌డుగు వేస్తాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close