మీడియాపైనే సెటైర్లు వేసిన మ‌హేష్‌

ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే, మీడియా ముందు కాస్త ఆచితూచి మాట్లాడ‌తారు. ఏం మాట్లాడితే, ఏం వ‌స్తుందో అనే భ‌యం ఉంటుంది. కానీ మ‌హేష్‌బాబు అలా కాదు. మీడియాపైనే సెటైర్లు వేసేశాడు. మ‌హేష్ ఎప్పుడూ అంతే. చిన్న‌చిన్న‌గా చుర‌క అంటిస్తుంటాడు. ఆయ‌న‌తో ప‌నిచేసేవాళ్లంతా ఈ విష‌యం చెబుతూనే ఉంటారు. ఇప్పుడు మీడియాకీ అది రుచి చూపించాడు.

మ‌హేష్ ఇంట‌ర్వ్యూలు ఈరోజు మ‌ధ్యాహ్నం అన్న‌పూర్ణ స్డూడియోలో జ‌రిగాయి. ఈ ఇంటర్వ్యూల‌లో మ‌హేష్ ఫుల్ స్వింగ్‌లో క‌నిపించాడు. ఫొటో గ్రాఫ‌ర్ల కోసం ఒక్క నిమిషం కూడా నిల‌బ‌డ‌లేదు. ‘కావాలంటే కూర్చుని మాట్లాడుతున్న‌ప్పుడు ఫొటోలు తీసుకోండి’ అని మొహంమీదే చెప్పేశాడు. దాంతో ఫొటోగ్రాఫ‌ర్లంతా మ‌హేష్‌పై కినుక వ‌హించారు.

ఆ త‌ర‌వాత రిపోర్ట‌ర్ల‌పైనా త‌న ఝ‌ల‌క్ చూపించాడు. ‘ప్రొడ‌క్ష‌న్‌లో పార్ట‌న‌ర్ షిప్ తీసుకున్నారు క‌దా.. ఇక ముందూ కొన‌సాగిస్తారా’ అని అడిగితే ‘ఏం చేయ‌కూడ‌దా’ అంటూ సెటైర్ వేశాడు. ‘ర‌ష్మిక‌తో ప‌నిచేశారు క‌దా ఎలా అనిపించింది’ అని అడిగితే.. ‘ఇదిగో ఈ ప్ర‌శ్నే వేయ‌లేదేంటా? అని ఎదురుచూస్తున్నా? ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ క్వ‌శ్చ‌న్ ఫ్రేమింగ్ మార్చుకోరా’ అంటూ మ‌ళ్లీ కెలికేశాడు మ‌హేష్‌. `పెద్ద హీరోలంతా కూర్చుని మాట్లాడుకుంటే రిలీజ్ డేట్ సమ‌స్య‌లు ఉండ‌వు క‌దా` అని ఓ పాత్రికేయుడు అడిగితే.. మీ పేప‌ర్‌లో మంచి ఆర్టిక‌ల్ రాయండి అంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. దాదాపు ప్ర‌తీ ప్ర‌శ్న‌కీ ఇలానే సెటైరిక‌ల్‌గా స‌మాధానం చెబుతూ వ‌చ్చాడు మహేష్‌. దాంతో ఖంగుతిన‌డం పాత్రికేయుల వంతు అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close