పాస్‌పోర్టుల రద్దు ప్రచారమూ బూమరాంగ్..!

అమరావతి ఆందోళలను అణిచివేయడానికి పోలీసులు అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి పాస్‌పోర్టుల రద్దు ప్రచారంతో మరింత ఊతం దొరికినట్లయింది. ఆందోళనల్లో పాల్గొనేవారి పాస్‌పోర్టులు రద్దు చేస్తామని పోలీసులు ప్రకటనలు చేశారు. దీంతో.. ఏపీలో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పాస్‌పోర్టులు రద్దు చేయడం అంత సులభమా..? అన్న చర్చ ప్రారంభమయింది. పోలీసులు ఈ దిశగా కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయమూ బలంగానే వినిపించింది. ఇది ఎంత తీవ్రంగా జరిగిందంటే.. చివరికి.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్పందించాల్సి వచ్చింది. పాస్‌పోర్టులు రద్దు చేస్తామని.. కొంత మంది పోలీసు అధికారులు చేసిన ప్రకటనను.. పరోక్షంగా ప్రస్తావించిన పాస్‌పోర్ట్ అధికారి.. అలాంటి అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు.

పాస్‌పోర్టు అనేదాన్ని కొన్ని నియమనిబంధనల ప్రకారం జారీ చేస్తామని.. రద్దు అనేది కూడా.. అలాగే ఉంటుందని.. ఆందోళనల్లో పాల్గొన్నారని.. పోలీసులు చెప్పారని.. రద్దు చేయడం ఉండదని స్పష్టం చేశారు. దీంతో … పోలీసుల ఓవరాక్షన్ మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అయింది. నిజానికి.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్పందించడానికి ముందు చాలా విషయం జరిగింది. పోలీసుల స్టేట్‌మెంట్లు ఢిల్లీ వరకూ వెళ్లాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని వివరణ కోరింది. అయితే.. పాస్‌పోర్టుల రద్దు చేయాలన్న విజ్ఞప్తులు కానీ.. అలాంటి అవకాశాలు కానీ లేవని.. ఉపరాష్ట్రపతి కార్యాలయానికి.. ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసు తెలిపింది. ఈ విషయంలో ప్రజల్లో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వడానికి ఓ నోట్ కూడా రిలీజ్ చేసింది. దీంతో పోలీసుల పరువు మరోసారి గంగలో కలిసిపోయినట్లయింది.

అమరావతి ఆందోళనల్లో .. ప్రజాస్వామ్య యుతంగా జరిగే ఉద్యమాల్లో పాల్గొన్నందుకు పాస్‌పోర్టు రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించడం.. వారి చట్ట వ్యతిరేక విధి నిర్వహణకు అద్దం పట్టేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ నేరస్తుడి డైరక్షన్‌లో పని చేస్తే.. ఎలా చట్ట వ్యతిరేకంగా పని చేస్తారో.. అలా చేస్తున్నారన్న విమర్శలు పెరిగిపోవడానికి ఈ పాస్‌పోర్టు వ్యవహారం … మరో కారణంగా నిలుస్తోందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close