వచ్చే నెల నుంచి పోరాటం షురూ అంటున్న రేవంత్

కొద్దిరోజుల కిందట, హైదరాబాద్లో సొంత ఆఫీస్ ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇకపై కేసీఆర్ సర్కారు మీద తన పోరాటం షురూ అన్నారు. కానీ, వెంటనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఆ టాపిక్ పక్కనబెట్టేయాల్సి వచ్చినట్టుంది.  ఇప్పుడు త్వరలో తన మార్కు పోరాటం ప్రారంభమౌతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు.

సొంత నియోజక వర్గం కొడంగల్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కొడంగల్ ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నారనీ, కానీ ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా కేటాయించింది లేదనీ, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. భూకేటాయింపుల్లో, ఐటీ హబ్స్ నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న శాఖల్లో అవినీతి చాలా జరిగిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నా అన్నారు. తండ్రీ కొడుకులు చేసిన అవినీతి మీద, వారు కొనుక్కున్న భూముల మీద, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల మీద, అక్రమ భూకేటాయింపుల మీద సమాచారమంతా సేకరించామన్నారు. ఇలాంటి వివరాలతో ఒక పుస్తకం ప్రచురిస్తా అన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తామన్నారు. కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసే అనుమతిని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇస్తారా లేదా, సుప్రీం కోర్టు తలుపు తట్టి ఈ కార్యక్రమాలు చెయ్యొచ్చా అనేది ఆలోచిస్తున్నామన్నారు.

రేవంత్ త్వరలో చేయబోయే ఆరోపణలన్నింటికీ నిర్దిష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయనే అంటున్నారు. అంతేకాదు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఒక్కోటిగా వచ్చే నెల నుంచి విడుదల చేస్తానని చెప్పారు. గతంలో కూడా ఇలానే ఓసారి పక్కా ప్రణాళికతో పోరాటానికి దిగుతున్నా అని రేవంత్ ప్రకటించిన సందర్భాలున్నాయి. గత నెలలోనే భారత్ బచావో కార్యక్రమం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సందర్భంగా కూడా రేవంత్ ఇలాంటి ప్రకటనే చేశారు. ఆ వెంటనే రాష్ట్రంలో తన పోరాటం మొదలౌతుందని ఢిల్లీలో చెప్పారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అవినీతీ ఆస్తులపై వచ్చే నెల నుంచి పోరాటం షురూ అంటున్నారు. ఇదైనా కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close